Thursday Puja : గురువారం పూజలో ఇలా చేస్తే.. మీకు డబ్బు లేని లోటు తీరిపోతుంది!
Brihaspati : మీ చేతుల్లోకి డబ్బు వస్తోంది. కానీ నిలవడం లేదా? అయితే గురువారం ఇలా పూజలు చేయడం ద్వారా మీకు ఉన్న డబ్బు సమస్య తొలగిపోవడంతో పాటు మీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది.
Brihaspati Mantras : ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు దేవతలకి గురువుగా పరిగణించే బృహస్పతిని గురువారం భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి బయటిపడొచ్చు. ఈరోజు ఉదయం స్నానమాచరించి.. బృహస్పతికి పసుపు, పువ్వులు సమర్పించి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత బృహస్పతి కథలు చదువుతూ ఆరాధించాలి. అనంతరం "ఓం బ్రూం బృహస్పతియే నమః" అంటూ 11 లేదా 21 సార్లు మంత్రాన్ని జపించాలి.
బృహస్పతిని గురువారం పూజించే ముందు అరటి చెట్టును కూడా పూజించడం మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. అరటికి పసుపు, పువ్వులను సమర్పించడం మరింత శ్రేయష్కరం. ఒకవేళ మీకు పెళ్లి ఆలస్యం అవుతుంటే గురువారం ఉపవాస దీక్ష చేసి బృహస్పతిని స్మరించుకుంటే వివాహ ఘడియలు దగ్గరపడతాయి. అయితే ఈ స్మరణ సమయంలో పసుపు బట్టలు ధరించాలని పండితులు చెప్తున్నారు. మీరు ఉపవాసం ఉండి.. ఆకలితో ఉన్న వారికి అరటి పండ్లను దానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ఒకవేళ మీకు విద్య, వృత్తి, ఆరోగ్య, ఉద్యోగ సమస్యలు ఉంటే.. బృహస్పతిని స్మరించుకుంటూ ఆధ్యాత్మిక పుస్తకాలను దానం చేయడం మంచిది. ఫలితంగా మీ సమస్యలు తొలిగిపోయే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు.
ఒకవేళ మీ చేతుల్లో డబ్బులు నిలవకపోతే.. బృహస్పతిని ఆరాధిస్తూ ఎరుపు లేదా పసుపు రంగు బట్టలో ఒక కొబ్బరికాయని చుట్టి పూజాగదిలో ఉంచండి. ఇలా చేయడం ద్వారా మీకు ఉన్న డబ్బు సమస్యలు పూర్తిగా తొలగిపోయి.. లక్ష్మీకటాక్షం కలుగుతుందని పండితులు చెప్తున్నారు.
బృహస్పతి మానవమాత్రుడైనా…
బృహస్పతి మానవ మాత్రుడైప్పటికీ.. శివుని ఆశీర్వాదంతో దైవత్వాన్ని పొందారు. తెలివితేటలు, బుద్ధితో ఎవరినైనా పోల్చాల్సి వస్తే మొదట గుర్తొచ్చేది బృహస్పతినే. విష్ణుమూర్తి ఆదేశానుసారం జ్ఞాన సంపన్నులు వచ్చి బృహస్పతికి ధర్మశాస్త్రాలను బోధించారని వినికిడి.
మనుషుల భవిష్యత్తును నిర్ధారించేవారిలో బృహస్పతి కూడా ఒకరు. కాబట్టి.. గురువారాన్ని ప్రత్యేకంగా బృహస్పతికి కేటాయించారు. విష్ణువుకి కూడా గురువారం ప్రీతికరమైన రోజే.. కాబట్టి ఇద్దరినీ కలిపి పూజిస్తే మరింత శ్రేయష్కరమని పండితులు చెప్తున్నారు.