వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఇంట్లో సంతోషం ఉంటుంది. ఏ దిశలో వేటిని ఉంచాలి?, ఏ దిశలో వేటిని ఉంచకూడదు వంటి విషయాలన్నీ వాస్తు మనకు చెప్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాన్ని కూడా సరైన దిశలో ఉంచాలి.
అద్దం సరైన దిశలో ఉంటే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి కూడా. చాలామంది ఇంట్లో అద్దం ఏ వైపు ఉంచాలి? ఏ వైపు ఉంచకూడదు అనేది తెలుసుకోవాలనుకుంటారు. ఇంట్లో అద్దం పెట్టేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం, అద్దం సరైన దిశలో ఉంటే డబ్బు రెట్టింపు అవుతుంది. అద్దం సంపదను రెట్టింపు చేస్తుంది. పైగా అద్దం సరైన దిశలో ఉంటే సంపదని ఆకర్షిస్తుంది. దాంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ఎప్పుడు కూడా విరిగిపోయిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు. అలా ఉంచినట్లయితే, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. లక్ష్మీదేవికి కూడా ఆగ్రహం కలుగుతుంది. సంపద కూడా తరిగిపోతుంది.
సనాతన ధర్మ పండితులు చెప్పిన దాని ప్రకారం, అద్దం ఉత్తరం వైపు ఉంటే మంచిది. ఇది కుబేరుడు దిశ. ఈ దిశలో అద్దం ఉండడం వలన ఆనందం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. సంపద పెరుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు. ఎలాంటి బాధలు కూడా ఉండవు.
లాకర్ లో అద్దం పెడితే సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అయితే, లాకర్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. లాకర్లో చెత్తాచెదారం వంటివి పెట్టకూడదు. లాకర్లో డబ్బులని పెట్టుకుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. లాకర్లో కొత్త నోట్లు, చిన్న అద్దం, కుబేరుడు విగ్రహం లేదా లక్ష్మీదేవి విగ్రహం, వెండి నాణెం ఇటువంటివి పెట్టడం వలన సంపద పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం