Shani effect 2025: కొత్త ఏడాది ఈ రెండు రాశుల వారికి శని నుంచి విముక్తి.. అన్నీమంచి శకునములే!-liberation from shani for these two zodiac signs in the new year all good adn positive ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shani Effect 2025: కొత్త ఏడాది ఈ రెండు రాశుల వారికి శని నుంచి విముక్తి.. అన్నీమంచి శకునములే!

Shani effect 2025: కొత్త ఏడాది ఈ రెండు రాశుల వారికి శని నుంచి విముక్తి.. అన్నీమంచి శకునములే!

Ramya Sri Marka HT Telugu
Dec 08, 2024 06:00 PM IST

Shani effect 2025: 2025లో శని రాశిచక్రం మారబోతోంది. శని రాశి చక్రం మారడం వల్ల కొన్ని రాశుల వారికి ఏలినాటి శని(సడే సాతి), శని ధయ్యా ప్రభావం పడనుంది. అలాగే మరికొన్ని రాశులకు శని ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి లభించనుంది. శని చెడు ప్రభావం నుంచి ఉపశమనం పొందుతున్న రాశులేవో చూద్దాం.

శని సంచారంలో మార్పుతో ఈ రాశుల వారికి విముక్తి
శని సంచారంలో మార్పుతో ఈ రాశుల వారికి విముక్తి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహలలో శనిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు. అందుకు కారణం కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడు. తొమ్మిది గ్రహాలలో శని చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహం. శని భగవానుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని ఒక నిర్దిష్ట సమయంలో నక్షత్రాలను కూడా మారుస్తాడు.శని సంచారంలో మార్పు కచ్చితంగా అన్ని రాశుల వారిపై పడుతుంది.

yearly horoscope entry point

శని ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్నాడు. శని సంచరిస్తున్న రాశికి అనుగుణంగా ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావం ఉంటుంది. దీని కారణంగా కుంభం, మీనం, మకర రాశుల వారికి శని ఏలినాటి శని(సడే సతి) ప్రభావాన్ని, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారికి అర్థాష్టమ శని(దయ్యా) ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే కొత్త సంవత్సరంలో వీరికి శని నుంచి విముక్తి కలుగనుంది. వచ్చే ఏడాది శని తన రాశిచక్రాన్ని మార్చుకోనున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి ఉపశమాన్ని ఇస్తుంది. శని రాశిలో మార్పు జరిగినప్పుడు సడే సతి, దయ్యాతో బాధపడుతున్న రాశిచక్ర గుర్తులకు విముక్తి తప్పకుండా విముక్తి లభిస్తుంది.

శని తన రాశిని ఎప్పుడు మార్చుకుంటుంది?

జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం.. 2025లో శని రాశిచక్రం మారబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి బాగా కలిసొస్తుంది. 2025 మార్చి 29న శని తన కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించను్న్నాడు. తిరగి 3 జూన్ 2027 వరకూ అదే రాశిలో నివాసముంటాడు. మార్చుకుంటాడు. శని రాశిచక్రం మారడం వల్ల కొన్ని రాశుల వారికి సడే సతీ అంటే ఏలినాటి శని, శని ధయ్య కలుగుతుంది. అలాగే మరికొన్ని రాశులకు వాటి నుంచి విముక్తి లభిస్తుంది.

కుంభం నుంచి మీన రాశిలోకి శని ప్రవేశించినప్పుడు శని కర్కాటక రాశి, వృశ్చిక రాశిని పరిపాలిస్తున్నాడు. వీరికి అర్థమశని నుంచి విముక్తి దొరుకుతుంది. 2025 మార్చి 29న కర్కాటకం, వృశ్చిక రాశి నుంచి శనిగ్రహం తొలగిపోతుంది.ఫలితంగా వీరి జీవితం సంతోషంతో నిండిపోతుంది.

2025లో కర్కాటకం, వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంతో చూద్దాం..

ఈ రెండు రాశుల వారికి 2025 మార్చి తరువాత అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బును మీరు తిరిగి పొందవచ్చు. అన్నింటా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ముందుగా లావాదేవీ కేసులను పరిష్కరించండి. ఈ రంగంలో ఆశించిన దానికంటే ఎక్కువ విజయాలు సాధిస్తారు. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారానికి సమయం అనుకూలంగా ఉంది. గౌరవం పెరుగుతుంది, అధికారులు సంతోషంగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. కళాత్మక వ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతుంది. మీ నిర్ణయాలు సక్రమంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు.

ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థి అయితే క్రీడల్లో గొప్ప విజయాలు సాధించవచ్చు. కుటుంబంతో అనురాగం పెరుగుతుంది. కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు మీకు లభిస్తుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంది. మీ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో కొత్త దిశపై దృష్టి పెడతారు. వ్యాపార పరంగా సమయం బాగుంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner