సింహ రాశి వార ఫలం: హ్యాపీ రొమాంటిక్ లైఫ్.. సంపద కలిగే ఛాన్స్.. లవ్ ప్రపోజల్ రావొచ్చు.. కుట్రలో చిక్కకుండా జాగ్రత్త!-leo weekly horoscope june 29th to july 5th happy romantic life income will be generate love proposal ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సింహ రాశి వార ఫలం: హ్యాపీ రొమాంటిక్ లైఫ్.. సంపద కలిగే ఛాన్స్.. లవ్ ప్రపోజల్ రావొచ్చు.. కుట్రలో చిక్కకుండా జాగ్రత్త!

సింహ రాశి వార ఫలం: హ్యాపీ రొమాంటిక్ లైఫ్.. సంపద కలిగే ఛాన్స్.. లవ్ ప్రపోజల్ రావొచ్చు.. కుట్రలో చిక్కకుండా జాగ్రత్త!

సింహ రాశి వార ఫలం జూన్ 29 నుంచి జులై 5: రాశిచక్రంలో ఐదవ రాశి సింహ రాశి. చంద్రుడు సింహ రాశిలో సంచరిస్తున్నప్పుడు జన్మించిన వారి రాశి సింహం. ఈ సింహ రాశి వార ఫలం ఎలా ఉందో ఇక్కడ చూసేయండి.

సింహ రాశి వార ఫలం

సింహ రాశి ఫలం, జూన్ 29-జులై 5, 2025: ఈ వారం సింహ రాశి వాళ్లకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రేమ జీవితం సృజనాత్మకంగా ఉంటుంది. వృత్తి జీవితం ఫలవంతంగా ఉంటుంది. జీవితంలో సంపదను చూస్తారు. దీని వల్ల ట్రేడింగ్‌లో ముఖ్యమైన పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రేమ జీవితానికి ఎక్కువ సమయం కేటాయించాలి. సంబంధాలకు సంబంధించిన అన్ని విషయాలను పరిష్కరించండి.

ఆర్థిక సమస్యలు

చిన్న ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు, కానీ వృత్తి జీవితం ఫలవంతంగా ఉంటుంది. సింహ రాశి వాళ్లకు మీ రొమాంటిక్ జీవితం మరింత క్రియేటివ్ గా మారుతుంది. హ్యాపీ రొమాంటిక్ లైఫ్ లీడ్ చేస్తారు. భాగస్వామిపై ప్రేమను కురిపించండి, దాని ఫలితాలు కనిపిస్తాయి. సింగిల్ గా ఉన్న సింహ రాశి వ్యక్తులూ గుడ్ న్యూస్ వింటారు.

ఎందుకంటే వారికి జీవితంలో కొత్త ప్రేమ లభించే అవకాశం ఉంది. రొమాన్స్‌లో ఆచరణాత్మకంగా ఉండండి, రాజీపూరితంగా మాట్లాడటం నేర్చుకోండి. కొన్ని ప్రేమ వ్యవహారాల్లో గ్రహాల కారణంగా సానుకూల మార్పులు కనిపించవచ్చు. సింగిల్ ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో లవ్ ప్రపోజల్ రావచ్చు. ముందుగా బ్రేకప్ అయిన వారికి కొంత మంచి జరగవచ్చు.

కుట్రకు బలికాకుండా

ఈ వారంలో ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి. మీరు కుట్రకు బలి కావచ్చు. ఆఫీసులో డబ్బులు, నిధులను నిర్వహించే వారు ఈ వారం లక్ష్యంగా చేసుకోబడవచ్చు. వివాదాలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. బ్యాంకర్లు, రాజకీయ నాయకులు, కళాకారులు, వ్యాపార అభివృద్ధి చేసేవారు, ఆర్కిటెక్ట్‌లు, చట్ట నిపుణుల జీవితంలో ఈ సమయంలో వివాదాలు కనిపించవచ్చు. కొంతమంది ప్రభుత్వ అధికారులకు బదిలీలు ఉండవచ్చు. వ్యాపారవేత్తలు ఈ వారం కొత్త ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరించవచ్చు.

ధన లాభం

మీ జీవితంలో ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. ఆర్థిక జీవితం స్థిరంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులను కొనడం గురించి ఆలోచించవచ్చు. మహిళలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు. ఈ వారం పెట్టుబడికి మంచిది, ముఖ్యంగా భూమి, స్టాక్, వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ గురించి బాగా పరిశోధించండి, ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టి డబ్బులు కోల్పోవాల్సిన అవసరం లేదు.

ఆరోగ్య సమస్యలు

మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావచ్చు. కళ్ళు, చెవులు, ముక్కులో సమస్యలు రావచ్చు. మీరు పడిపోయే అవకాశం ఉంది. ఈ వారం కాళ్ళు విరిగే అవకాశం ఉంది. వృద్ధులు బస్సు, రైలులో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

డాక్టర్ జె.ఎన్. పాండే, వైదిక జ్యోతిష్య మరియు వాస్తు నిపుణుడు.

ఈ-మెయిల్: djnpandey@gmail.com

ఫోన్: 91-9811107060 (వాట్సాప్ మాత్రమే)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం