జాతకంలో బుధుడు, శుక్రుడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. శుక్రుడు ఐశ్వర్యం, భౌతిక సుఖాలు, శ్రేయస్సుకి కారకుడు. బుధుడు మేధస్సు, వ్యాపారం, సంపదను అందిస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెండు గ్రహాలు కలిసి వచ్చినప్పుడు ఈ యోగం ధనవంతుడిగా మారుస్తుంది. శ్రేయస్సుని అందిస్తుంది.
ఈ యోగం ఎవరి జాతకంలో ఏర్పడుతుందో వారికి, లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఈ యోగం ఏర్పడదు. కొన్ని ప్రత్యేక పరిహారాలని పాటిస్తే, ఈ యోగాన్ని పొందడానికి అవుతుంది.
జ్యోతిష నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల జాతకాలలో ఇది తరచుగా కనపడుతుంది. మీ జీవితంలో కూడా ఈ యోగం ఏర్పడి, శుభ ప్రభావాన్ని పొందాలనుకుంటే.. భోజనం చేసిన తర్వాత ఆకుపచ్చ యాలకులను, పటిక బెల్లాన్ని తినడం మంచిది.
ఇలా భోజనం చేసిన తర్వాత దీనిని తినడం వలన బుధుడు, శుక్రుడిని బలపరుస్తుంది. దీంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. జీవితంలో సానుకూల ప్రభావం కనపడుతుంది.
ఆకుపచ్చ యాలకులు బుధ గ్రహానికి ప్రతీక. మేధస్సు, ప్రసంగం, వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది. పటిక బెల్లం శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. శ్రేయస్సు, ఆనందాన్ని ఇస్తుంది. ఈ రెండిటిని కలిపి తినడం వలన బుధ, శుక్రులకు బలాన్ని ఇస్తుంది. దీంతో లక్ష్మీ నారాయణ యోగ ప్రభావం పడుతుంది.
ఒక వ్యక్తికి లక్ష్మీనారాయణ యోగం కలిగిందంటే, జీవితంలో చాలా మార్పులు వస్తాయి. చాలా సమస్యల నుంచి బయటపడచ్చు. సంతోషంగా ఉండొచ్చు. ఇక లక్ష్మీనారాయణ యోగం వలన ఎలాంటి లాభాలని పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ యోగం వ్యాపారం, సంపదను పెంచడానికి సహాయం చేస్తుంది. ఈ యోగంతో ఆర్థిక లాభాన్ని పొందవచ్చు.
లక్ష్మీనారాయణ యోగ ప్రభావం వలన ఆకస్మిక ధన లాభాన్ని పొందవచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా బయటపడవచ్చు.
ఈ లక్ష్మీనారాయణ యోగం వలన నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. అలాగే తెలివితేటలు కూడా బాగా ఉంటాయి. దీంతో జీవితంలో చాలా మార్పు వస్తుంది.
వ్యక్తి జీవితంలో లక్ష్మీనారాయణ యోగం ఉంటే విలాసాలకు కొరత ఉండదు. సుఖసంతోషాలతో ఉంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం