Ugadi Rasi Phalalu 2025: కుంభ రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు.. ఈ ఏడాది ఆర్థిక లాభం, సంతాన ప్రాప్తి!-kumbha rasi ugadi rasi phalalu 2025 know vishwavasu telugu new year rasi phalalu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi Rasi Phalalu 2025: కుంభ రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు.. ఈ ఏడాది ఆర్థిక లాభం, సంతాన ప్రాప్తి!

Ugadi Rasi Phalalu 2025: కుంభ రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు.. ఈ ఏడాది ఆర్థిక లాభం, సంతాన ప్రాప్తి!

HT Telugu Desk HT Telugu

Ugadi Rasi Phalalu 2025: కుంభ రాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా వున్నాయి? కుంభ రాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కుంభ రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు (pinterest)

కుంభం (ధనిష్ఠ 3,4: శతభిషం: పూ.భా.1,2,3 పాదాలు)

కుంభ రాశి వారి శ్రీ విశ్వావసు నామ సంవత్సర నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా

గురుడు వృషభ రాశి సంచారంతో ఆకస్మిక ధన వ్యయం

గురుడు ఈ సంవత్సరము ఉగాది నుండి 14.5.25 వరకు వృషభంలో ఉంటాడు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మిథునంలో గురుడు సంచారం వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.

20.10.25 నుండి 5.12.25 వరకు కర్కాటకంలో ఉంటాడు. దీనితో ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.

శని మీన రాశి సంచారంతో ఆటంకాలు

శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.

రాహువు మీన రాశి సంచారంతో పేరు, ప్రతిష్ఠలు

రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు మీనంలో ఉంటాడు. ఆకస్మిక ధన లాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.

19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

కేతువు కన్య రాశి సంచారంతో భయాందోళనలు

కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు కన్యలో ఉంటాడు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచి వుంటారు. దైవ దర్శనం లభిస్తుంది.

2025-26 కుంభ రాశి వారి శ్రీ విశ్వావసు నామ సంవత్సర నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా

బృహస్పతి మే నుండి అయిదవ స్థానము, శని రెండవ స్థానమ, రాహువు మే నుండి ఒకటవ స్థానము (జన్మరాశి) నందు మరియు కేతువు మే నుండి ఏడవ స్థానములో సంచరించుట చేత కుంభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడిన సంవత్సరం.

ఏలినాటి శని అంత్యభాగ సమయం కావటం, జన్మరాశిలో రాహువు ప్రభావం వలన ఈ సంవత్సరం కుంభ రాశి వారికి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబములో సమస్యలు అధికముగా ఉండును. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములో ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు, రాజకీయ ఒత్తిళ్ళు ఎదురగును.

ఎవరికి ఎలా?

  1. కుంభ రాశి విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం, మధ్యస్థ సమయం.
  2. స్త్రీలకు ఈ సంవత్సరం ఒత్తిళ్ళు అధికముగా ఉండును.
  3. ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచన.
  4. స్త్రీలకు కుటుంబములో కొన్ని సమస్యలు వేధించును.
  5. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. అప్పుల బాధలు సమస్యలు ఇబ్బంది పెట్టును. రావలసిన ధనము సమయానికి రాలేనటువంటి స్థితి ఏర్పడును.
  6. గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికి కుంభ రాశి వారు ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అప్పు చేయవద్దు, అప్పు ఇవ్వవద్దు.
  7. శత్రు పీడ కొంత ఇబ్బంది కలిగించును.
  8. కుంభ రాశి రాజకీయ నాయకులకు చెడు సమయం.
  9. రైతాంగానికి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మొత్తం మీద కుంభ రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కొంత కఠినమైనటు వంటి సంవత్సరం.

గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలలో ప్రదక్షిణలు చేయటం మెండు. శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది.

మాసవారి ఫలితములు

ఏప్రిల్ నెల

ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగకాశములు. దైవకార్యములు చేస్తారు.ఇంట్లో శుభకార్యములు నిర్వహిస్తారు. స్నేహితుల సహకారముంటుంది. శత్రువులను కలుపుతారు. విదేశీ ప్రయాణం. భయందోళన. ఖర్చులు ఎక్కువ. కంపెనీలో వాటా కొనుగోలు చేస్తారు.

మే నెల

ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా అనుకూలం. ధన లాభం. భోజన సేవలు. కుటుంబములో దానములు. దైవసంబంధిత కార్యాలు. స్థాన మార్పులు. మంచి విశేష వార్తలు వింటారు. ఇతరుల సహకారం లభిస్తుంది.

జూన్ నెల

ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. మానసికాలోచన. స్త్రీ పరిచయం. ఏ పనైనా సులభంగా చేస్తారు. ఇతర ధనముతో మసలుట. విందు భోజన సౌఖ్యం. స్థాన మార్పులు. శుభవార్తలు వింటారు. మొండిగా ప్రవర్తిస్తారు. ఇతరుల సహాయ సహకారాలుంటాయి.

జూలై నెల

ఈ మాసం మీకు అన్ని విధాలుగా కలసివచ్చును. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా జరుగును. బంధువుల రాక. ధనం పొదుపు చేసేదరు. స్త్రీ సుఖం ప్రయాణం, ఉద్యోగంలో పని ఆలస్యంగా జరుగును. నరముల బలహీనతతో బాధ పడాల్సి ఉంటుంది. ధనం కలసివచ్చును. వ్యాపారం ప్రారంభిస్తారు.

ఆగస్టు నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు, ఆకస్మిక బదిలీలుంటాయి. అధికార ఒత్తిడి వలన పెద్ద సంఘటన జరుగును. కొత్త ప్రయత్నములు చేస్తారు. వృత్తి, వ్యాపారపరంగా లాభాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ మాటల వల్ల ఇతరులు ఇబ్బందిపడతారు.

సెప్టెంబర్ నెల

ఈ మాసం అనుకూలంగా లేదు. స్నేహితుల ద్వారా ధన నష్టం. విలువైన వారికి దూరమవుతారు. కొంత ఒడిదుడుకులుంటాయి. అప్పులు చేస్తారు. వస్త్ర సేవ. తీర్థయాత్రలు చేస్తారు. ఔషధ సేవ. ఆదాయంలో కొంత నష్టం వస్తుంది. దురుసుగా ఉంటారు. భయాందోళనలుంటాయి.

అక్టోబర్ నెల

ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా కలసివచ్చును. వాహన యోగమున్నది. బంగారం కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అధిక వ్యయం. దైవ సంబంధ కార్యాలకు ఖర్చులు. నమ్మిన వారు మోసం చేస్తారు. నిరాశ.

నవంబర్ నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విక్రయాలకు ఆటంకాలు. వ్యసనముల ద్వారా దుబారా ఖర్చులు చేస్తారు. పై చదువులకు అవకాశం. ఉద్యోగం కలసివచ్చును. బద్దకము, కలహములుంటాయి. ఉద్యోగములలో ఒత్తిడితో పనులు నిలిచిపోతాయి.

డిసెంబర్ నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నాలు, కొత్త పరిచయాలు, ఖర్చులు పెరుగును. భార్యా పిల్లలలో కలసి ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు పని భారం ఎక్కువ. మీరు అనుకున్న పనులు కాస్త ఆలస్యం అగును. ప్రభుత్వ ఉద్యోగులకు శత్రుత్వము పెరుగును.

జనవరి నెల

ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. విదేశీ వ్యాపారములు కలసివచ్చును. ఇంట్లో అశుభ వార్తలుంటాయి. కలహములు ఏర్పడును. ఇతరుల మాట సహాయము తీసుకుంటారు. ఇంటి నిర్మాణమునకై అప్పులు చేస్తారు. మీ సంకల్పం నెరవేరుతుంది. ఆలోచనలు పెరుగును.

ఫిబ్రవరి నెల

ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ఆదాయం పెరుగును. బాకీలు వసూలు అగును. అధికార ఒత్తిడి, సోదరులతో భేదాభిప్రాయములు. ఇంట్లో శుభకార్యములు. ప్రియతములతో విహారయాత్రలు. ఆత్మీయులకు మీరు సహాయపడతారు. బంధుమిత్రులతో ధనవ్యయం.

మార్చి నెల

ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. నూతన వాహన యోగం. కొత్త పరిచయములు పెరుగును. కొన్ని అవకాశాలు వదులుకుంటారు. సంతానపరంగా ఆలోచనలుంటాయి. స్త్రీలకు సంతాన ప్రాప్తి. ప్రతి విషయంలో ధైర్యము, పట్టుదలతో ఉంటారు. తల్లిదండ్రుల సహకారముంటుంది. వ్యాపారములలో లాభం. కోర్టు కేసులో విజయం. పితృ విరోధములుంటాయి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

HT Telugu Desk

సంబంధిత కథనం