Kumbha Rasi Today: ఒక వ్యక్తి రాకతో ఈరోజు కుంభ రాశి వారికి కొత్త సమస్యలు, ఆకస్మిక ఖర్చు తప్పదు
Aquarius Horoscope Today: రాశిచక్రంలో 11వ రాశి కుంభ రాశి. పుట్టిన సమయంలో కుంభ రాశిలో సంచరించే జాతకుల రాశిని కుంభ రాశిగా పరిగణిస్తారు. ఈరోజు కుంభ రాశి వారి ఆరోగ్యం, ఆర్థిక, ప్రేమ, కెరీర్ జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
Kumbha Rasi Phalalu 27th August 2024: కుంభ రాశి వారికి ప్రేమ జీవితంలో ఈరోజు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువ సమయాన్ని మీ భాగస్వామితో ఈరోజు గడుపుతారు. ఆఫీసులో ఇచ్చిన పనులన్నీ సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యంగా ఉండండి. సంబంధాలలో వచ్చే సమస్యలను తెలివిగా పరిష్కరించుకోండి. వృత్తి జీవితంలో సవాళ్లతో కూడిన కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి.
ప్రేమ
భాగస్వామితో ప్రేమలో నమ్మకంగా ఉండండి. ఇది బంధాన్ని పెంపొందించుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీరు ఈ రోజు ఎటువంటి వివాదంలో జోలికి వెళ్లకండి. రాబోయే రోజుల్లో ఇదే మీ ఇద్దరి మధ్య గొడవను పెంచుతుంది. ఈ రోజు మీ జీవితంలోకి మూడో వ్యక్తి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు, దీని వల్ల సమస్యలు రావొచ్చు. మీ మాజీ లవర్ గురించి జాగ్రత్తగా ఉండండి. అవి మీ సంబంధంలో సమస్యలను కూడా పెంచుతాయి. వివాహితులు ఈరోజు మాజీ ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది తీవ్రమైన పరిస్థితిగా మారే ప్రమాదం ఉంది.
కెరీర్
కుంభ రాశి జాతకులకు ఈరోజు కెరీర్ పరంగా బాగుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఉన్నవారు ఆత్మవిశ్వాసంతో హాజరు కావాలి. ఆఫీస్‌లో ఎటువంటి వాదోపవాదాలకి దిగొద్దు. వృత్తిపరమైన సవాలును పరిష్కరించడానికి మీ సమయాన్ని వెచ్చించండి. కొన్ని పనులకు ఓవర్ టైమ్ పనిచేయడం అవసరం అవుతుంది. ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చినవారు ఫలితాలపై ఆత్మవిశ్వాసంతో ఉండాలి.
ఆర్థిక
ఈ రోజు కుంభ రాశి వారు వ్యక్తిగత ఆనందం కోసం డబ్బు ఖర్చు చేస్తారు, కానీ అనవసరమైన విషయాలలో ఈ డబ్బును ఖర్చు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు కుటుంబ సభ్యులతో ఆర్థిక వ్యవహారాలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. మీరు దాని కోసం డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే మధ్యాహ్నంపైన ఇవ్వొచ్చు.
ఆరోగ్యం
గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కొంతమంది పిల్లలకు వైరల్ ఫీవర్ ఉండవచ్చు. కూల్ డ్రింక్స్‌కు బదులు ఫ్రెష్ జ్యూస్ తీసుకోవచ్చు. అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.