కుంభ రాశి వార ఫలాలు: ఏప్రిల్ 27 నుండి మే 3 వరకు ఎలా ఉండబోతోంది? తెలుసుకోండి!-kumbha rasi aquarius weekly horoscope 27th april to 3rd may 2025 in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కుంభ రాశి వార ఫలాలు: ఏప్రిల్ 27 నుండి మే 3 వరకు ఎలా ఉండబోతోంది? తెలుసుకోండి!

కుంభ రాశి వార ఫలాలు: ఏప్రిల్ 27 నుండి మే 3 వరకు ఎలా ఉండబోతోంది? తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu

కుంభ రాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉంటుంది. ఈ రాశికి చిహ్నం 'నీరు పోసే పాత్ర'. కుంభ రాశికి అధిపతి శని భగవానుడు. ఎవరి జన్మ సమయంలో చంద్రుడు కుంభ రాశిలో సంచరిస్తాడో, వారి రాశిని కుంభ రాశికి చెందిన వారిగా పరిగణిస్తారు. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు కుంభ రాశి వార ఫలాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు కుంభ రాశి వార ఫలాలు

కుంభ రాశి వార ఫలాలు: ప్రేమ జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఆఫీసులో క్రమశిక్షణతో ఉండండి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ డబ్బు విషయంలో కాస్త ఆచూ తూచీ వ్యవహరించాలి. జాగ్రత్తగా ఖర్చు చేయడం చాలా ముఖ్యం. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు కుంభ రాశి ఏయే అంశాల్లో ఎలా ఉండబోతుంతో ఇక్కడ తెలుసుకోండి.

కుంభ రాశి ప్రేమ జీవితం:

కుంభ రాశి వారు ఈ వారం ప్రేమ విషయంలో చాలా అదృష్టవంతులు. సంబంధాలకు సంబంధించి ఎలాంటి తీవ్రమైన సమస్యలు లేవు. అయితే బంధం బలంగా ఉండాలంటే అహంకారాన్ని దూరం చేసుకోవడం చాలా అవసరం. కొంతమంది కుంభ రాశి స్త్రీలకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. వివాహం జరిగే యోగాలు ఉన్నాయి. వివాహితులు ఆఫీసు ప్రేమ వ్యవహారాల నుండి దూరంగా ఉండాలి. మీరు, మీ సహోద్యోగి మధ్య అనుబంధం పెరిగే అవకాశం ఉంది.

కెరీర్ రాశి ఫలాలు:

ఆఫీసు జరిగే రాజకీయాల వల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అహంకారం వల్ల పరిస్థితులు దిగజారకుండా చూసుకోండి. ఆఫీసులో ఉన్నతాధికారులతో చర్చల సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ చర్చల ద్వారా వారు మీ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. వ్యాపారస్తులకు కొత్త భాగస్వాములు దొరకడం వల్ల సంతోషం కలుగుతుంది. ముఖ్యంగా వారం ప్రారంభంలో మీకు అంతా బాగుంటుంది. వ్యాపార పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వ అధికారులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోండి.

ఆర్థిక జీవితం:

ఆర్థిక విషయాలలో కుంభ రాశి వారికి ఈ వారం అంతగా బాగుండదు. ఆదాయం బాగుంటుంది, కానీ అదే స్థాయిలో ఖర్చులు పెరుగుతాయి. ప్రస్తుతం అధిక స్థాయిలో పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. కొంతమంది స్త్రీలు కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు. అలాగే, బంధువుల నుండి ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం అవసరం. వ్యాపారస్తులు పెద్ద పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యాపారస్తులకు ప్రమోటర్ల నుండి నిధులు లభిస్తాయి.

ఆరోగ్య రాశి ఫలాలు:

ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. అసౌకర్యంగా అనిపించినప్పుడల్లా వైద్య సలహా తీసుకోండి. కొంతమంది స్త్రీలకు స్త్రీసంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. మధ్యాహ్నం తర్వాత జిమ్ లేదా యోగా తరగతులకు చేరడానికి మంచి సమయం. వృద్ధులకు ఛాతీ నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండటం అవసరం.

డా. జె.ఎన్. పాండే

వేద జ్యోతిష్యం మరియు వాస్తు నిపుణులు

ఇ-మెయిల్: djnpandey@gmail.com

ఫోన్: 91-9811107060 (వాట్సాప్ మాత్రమే)