Kumbh Mela Types: కుంభమేళాలలో 4 రకాలు ఇవి.. వీటిలో శక్తివంతమైనది ఏదో తెలుసా?-kumbh mela types there are four and check which one is most powerful here are the full details of it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kumbh Mela Types: కుంభమేళాలలో 4 రకాలు ఇవి.. వీటిలో శక్తివంతమైనది ఏదో తెలుసా?

Kumbh Mela Types: కుంభమేళాలలో 4 రకాలు ఇవి.. వీటిలో శక్తివంతమైనది ఏదో తెలుసా?

Peddinti Sravya HT Telugu
Jan 21, 2025 07:00 AM IST

Kumbh Mela Types: మతం, ఆత్మ, భక్తికి సంబంధించిన వేడుక ఇది. లక్షలాది మంది భక్తులు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలని భౌతిక ప్రపంచం కలిగి ఉన్న చెడుల నుంచి విముక్తి పొందాలని ప్రయాగరాజ్ ఇతర ప్రదేశాలకు వెళ్తున్నారు.

మహా కుంభమేళా 2025
మహా కుంభమేళా 2025

కుంభమేళాకు చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. దేశ, విదేశాల నుంచి కూడా చాలా మంది కుంభమేళాకు హాజరవుతారు.

yearly horoscope entry point

కుంభమేళా అంటే ఏంటి?

కుంభమేళా అంటే ప్రపంచంలోనే అతి పెద్ద శాంతియుతమైన ఆధ్యాత్మిక సమావేశం. అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడింది. మతం, ఆత్మ, భక్తికి సంబంధించిన వేడుక ఇది. లక్షలాది మంది భక్తులు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలని భౌతిక ప్రపంచం కలిగి ఉన్న చెడుల నుంచి విముక్తి పొందాలని ప్రయాగరాజ్ ఇతర ప్రదేశాలకు వెళ్తున్నారు.

పురాణాల ప్రకారం విష్ణువు అసురుల నుంచి అమృతం కుండను తీసుకున్నప్పుడు అమృతం నాలుగు చుక్కలు వేరు వేరు ప్రదేశాల్లో పడ్డాయి. ఆ నగరాలు ఇప్పుడు కుంభమేళాను నిర్వహిస్తున్నాయి.

కుంభమేళాలో రకాలు

ఇప్పుడు 2025లో జరుగుతున్నది మహాకుంభమేళా. 2025లో జీవితంలో ఒక్కసారి జరిగే మహాకుంభమేళా వైభవాన్ని ప్రపంచం చూస్తోంది. 2025 లో మహాకుంభానికి 40 కోట్ల మంది ప్రజలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మహాకుంభం కాకుండా ఇంకో మూడు రకాల కుంభాలు ఉన్నాయి. ప్రతి ఒకటి నిర్దిష్ట సమయ వ్యవధిలో, నిర్దిష్ట స్థానాల్లో విభిన్న గ్రహాల అమరికలో జరుగుతుంది.

1.మాఘ మేళ

మాఘ మాసంలో ప్రయాగరాజ్ లో ఈ ఇది జరుగుతుంది. జనవరి, ఫిబ్రవరి మధ్య రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతారు. మాఘ మేళా పెద్ద సమావేశాలకు పూర్వగామిగా మారుతుంది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశమైన త్రివేణి సంగమం దగ్గర భక్తులు చేరుతారు. నదుల్లో స్నానాలు చేస్తారు. దేవతలకు ప్రార్ధనలు చేస్తారు.

2. అర్థ కుంభమేళా

అర్థ కుంభమేళాను ప్రతి ఆరేళ్లకు ఒకసారి జరుపుతారు. ప్రయాగరాజ్ లో ఇది జరుగుతుంది. రెండు పూర్ణకుంభల మధ్య ఇది ఉంచబడింది. అర్థ కుంభమేళా అనేది పూర్ణకుంభం కోసం భక్తులకు సిద్ధం చేసే సమావేశం. చివరి అర్ద కుటుంబాన్ని 2019లో ప్రయాగరాజ్ లో జరిగింది.

3. పూర్ణ కుంభమేళా

ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభాన్ని జరుపుతారు. ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినీలో ఎక్కడైనా దీనిని జరుపుతారు. తేదీ, సమయం సూర్యుడు, చంద్రునికి సంబంధించిన బృహస్పతి స్థానం ద్వారా నిర్ణయించబడుతుంది.

4. మహా కుంభమేళా

ప్రతీ 144 ఏళ్లకు ఒకసారి దీనిని జరుపుతారు. 12 పూర్ణకుంభాలు తర్వాత మహాకుంభాన్ని జరుపుతారు. దీని కోసం భక్తులు చాలా సంవత్సరాలు వేసి ఉండడం జరుగుతుంది.

శక్తివంతమైన మహా కుంభమేళా

ప్రతీ కుంభమేళాకు ప్రాముఖ్యత, శక్తి ఉన్నప్పటికీ పూర్ణకుంభం, మహా కుంభం శక్తి యొక్క సంపద. మహాకుంభమేళా అరుదైనది. ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది చాలా మంది జీవితంలో ఒక్కసారి కూడా దీన్ని చూడలేరు. ఎందుకంటే ఇది 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం