Kumbh Mela 2025: కుంభమేళ పుణ్య స్నానాలు ఎపుడు ఆచరించాలి?ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)కుంభమేళా పర్వంలో స్నానము చేయుటకు తిధులు
Kumbh Mela 2025: ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) లో కుంభమేళా పర్వంలో స్నానము చేయుటకు గల మహిత్వ పూర్ణమైన తిధులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) లో కుంభమేళా పర్వంలో స్నానము చేయుటకు గల మహిత్వ పూర్ణమైన తిధులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మహిత్వపూర్ణమైన తిధులు
1. పుష్య శుక్ల పూర్ణిమ 2025 జనవరి 13వ తేది సోమవారం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
2. ప్రథమస్నానము ఉత్తరాయణం ప్రారంభం 2025 జనవరి 14 తేది మంగళవారం ఈ దినమున దేవతల యొక్క ఉపాసన పూర్ణకాలంలోనే ప్రారంభం. ఈ రోజునే పరా అపరా విద్యను పొందిన కాలం. సాధకులకు సిద్ధిపొందు టకు అనుకూలదినము. దేవ ప్రతిష్ఠలకు, గృహనిర్మాణాలకు అత్యంతఅనువైన కాలంగా చెప్పబడుచున్నది.
పితృదేవతలకు తిల తర్పణములు చేయురోజుగా చెప్పబడినది. మహాభారతములో కూడా భీష్మ పితామహుడు సూర్యుడు ఉత్తరాయణం వచ్చేవరకు వేచియుండెను. శారీరక ఆరోగ్యం మరియు సర్వ కళ్యాణం కొరకు నువ్వులను ఆరురకాలుగా ఉపయోగించుటచే ప్రయాగలో జరిగే కుంభమేళా పర్వదినమున ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో పుణ్యదాయకము. త్రివేణీ సంగమ స్నానము పుణ్య ఫలమును ఇచ్చును అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
3. ఏకాదశే స్నానము: 2025 జనవరి 25 తేదీ శనివారం
4. రెండవ ముఖ్యమైన స్నానము: పుష్య బహుళ అమావాస్య 2025 జనవరి 29 తేదీ బుధవారం దీనిని మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున సదాచారముతో మౌనమును పాటించుటచే జ్ఞానమును పొందవచ్చును. ఈరోజున త్రివేణీ సంగమంలో స్నాన మాచరించిన అత్యధిక ఫలితాలు పొందవచ్చును. పుష్య మాసంలో అమావాస్య సర్వ శ్రేష్టమైన పర్వము అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
5. మూడవ ముఖ్యమైన స్నానము : మాఘ శుక్ల పంచమి, వసంత పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. 2025 ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం ఈ రోజున సరస్వతీదేవితో పాటుగా ధన, సంపదలకు ఆరాధ్య దైవమైన లక్ష్మీ-విష్ణుమూర్తి పూజ చేయాలని శాస్త్రము. ఈ రోజునే రతీ-కామదేవుని పూజ మరియు మహోత్సవం జరుగును. త్రివేణి సంగమంలో స్నానము చేయుట అత్యధిక పుణ్యఫలము ఇచ్చును.
6. రధసప్తమి: మాఘశుక్ల సప్తమి రథసప్తమి. 2025 ఫిబ్రవరి 4తేదీ మంగళవారము.
7. జయ ఏకాదశి : మాఘ శుక్ల ఏకాదశి, దీనినే భీష్మఏకాదశి అని అంటారు.
2025 ఫిబ్రవరి 8వ తేదీ శనివారం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
8. మాఘ పూర్ణిమ : మాఘశుక్ల పూర్ణిమ 2025 ఫిబ్రవరి 12 తేదీ బుధవారం కుంభమేళా పర్వంలో ఈ రోజున స్నానము, దానము చేసిన మంచి ఫలితములు పొందగలరు. ఈ రోజున కుంభ సంక్రాంతి కూడా అగుటచే విశేషమైన దినం.
9. మహాశివరాత్రి : మాఘ బహుళ చతుర్దశీ 2025 ఫిబ్రవరి 26 తేదీ బుధవారం మహాశివరాత్రి స్నానము అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం