వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోయి, సంతోషంగా ఉండొచ్చు. చాలా మంది ఇంట్లో కొన్ని వస్తువుల్ని సరైన దిశలో పెట్టకుండా పొరపాట్లు చేస్తూ ఉంటారు.
ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండాలంటే, కొన్నిటిని పాటించడం మంచిది. ముఖ్యంగా ఈ పొరపాటు చేయకుండా ఉండటం మంచిది. సంపదని ప్రసాదించే కుబేరుడు ఉండే దిశలో కొన్ని వస్తువులను పెట్టడం వలన సానుకూల శక్తి తొలగిపోయి, ప్రతికూల శక్తి కలుగుతుంది.
కుబేరుడు ఉత్తరం వైపు ఉంటారు. కుబేరుడు దిశలో కొన్ని వస్తువులను పెట్టడం వలన సమస్యలు తప్పవు. మరి ఉత్తరం వైపు వేటిని ఉంచకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరం వైపు షూ, చెప్పులని ఉంచడం మంచిది కాదు. ఇది కుబేరుడి స్థానం. ఈ దిశలో వీటిని ఉంచితే సంపదను కోల్పోవాల్సి ఉంటుంది. ప్రతికూల శక్తి కలుగుతుంది.
ఉత్తరం వైపు బాత్రూం లేదా టాయిలెట్లు ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. గాజు బౌల్లో ఉప్పు వేసి బాత్రూం కార్నర్ లో ఉంచండి. ప్రతీ వారం ఉప్పును మారుస్తూ ఉండండి. ఇలా చేస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి.
బరువైన ఫర్నీచర్ వంటివి ఉత్తరం వైపు ఉండకూడదు. ఉత్తరం వైపు ఎప్పుడూ గాలి, వెల్తురు బాగా ఉండాలి. అప్పుడే సానుకూల శక్తి కలిగి సంతోషంగా ఉండొచ్చు.
చాలా మంది ఇంట్లో పాడైపోయినవి, పనికిరానివి ఇంట్లో ఉంచుతారు. ఉత్తరం వైపు వీటిని పెట్టకూడదు. అలా చేస్తే వాస్తు దోషాలు కలుగుతాయి. ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది.
చెత్తబుట్ట వంటివి కూడా ఉత్తరం వైపు పెట్టకూడదు. ఉత్తరం వైపు వీటిని ఉంచితే సానుకూల శక్తి తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సంతోషం కూడా పోతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం