Yogini Ekadashi date: యోగిని ఏకాదశి తేదీ, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి
Yogini Ekadashi date: యోగిని ఏకాదశి తేదీ, వ్రత కథ, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి
యోగిని ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలా రెండు ఏకాదశి తిథులు వస్తాయి. ఒకటి కృష్ణ పక్షంలో, మరొకటి శుక్లపక్షంలో ఏకాదశి తిథి వస్తుంది. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి.
ట్రెండింగ్ వార్తలు
ఆషాడ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. తద్వారా సకల కోరికలు నెరవేరుతాయి.
యోగిని ఏకాదశి తేదీ, పూజా విధానం, శుభ ముహూర్తం తదితర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
యోగిని ఏకాదశి తేదీ : జూన్ 14, 2023
ఏకాదశి తిథి ప్రారంభం: జూన్ 13, 2023 ఉదయం 09.28 గంటలకు
ఏకాదశి తిథి సమాప్తం: జూన్ 14, 2023 ఉదయం 08.48 గంటలకు
యోగిని ఏకాదశి కథ:
ధర్మరాజు ఓసారి శ్రీకృష్ణుడితో యోగిన ఏకాదశి కథ చెప్పమని కోరాడట. ఇందుకు శ్రీకృష్ణుడు బదులిస్తూ ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారని చెబుతాడు. ఈ పర్వదినాన ఉపవాసం చేస్తే ఇహలోకంలో ఆనందం, పరలోకంలో మోక్షం లభిస్తాయని చెబుతాడు. దీనికి సంబంధించిన కథ వివరిస్తాడు.
‘కుబేరుడు అనే రాజు అల్కాపురి రాజ్యాన్ని పాలించేవాడు. అతడు శివభక్తుడు. అతడి సేవకుడు హేమాలి ప్రతిరోజూ పూజ కోసం మానస సరోవరం నుంచి పూలు తెచ్చే వాడు. ఓ రోజు భార్య మోజులో పడి దైవ కార్యాన్ని విస్మరిస్తాడు. దీనికి కుబేరుడు శపిస్తాడు. హేమాలి భార్య దూరమైపోతుంది. కుష్టువ్యాధిగ్రస్తుడై భూలోకంలోకి వస్తాడు.
భూలోకంలో మార్కండేయ మహర్షి వద్ద తన బాధ చెప్పుకుంటాడు. దీనికి పరిహారంగా యోగిని ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని మహర్షి సూచిస్తాడు. సకల పాపాలు తొలగిపోతాయని చెబుతాడు. హేమాలి అలాగే ఉపవాసం చేసి శాపవిముక్తి పొందుతాడు..’ అని శ్రీకృష్ణుడు ఈ కథ చెబుతాడు.
యోగిని ఏకాదశి పూజ ఎలా చేయాలి?
ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేయాలి. గంగా జలాలతో పూజామందిరంలోని విష్ణుమూర్తిని ఆరాధించాలి. పూలు, తులసి దళాలు సమర్పించాలి. దీపం వెలిగించాలి. విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించండి. అందులో తులసి ఆకులు కూడా ఉంచండి. విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పూజించండి. ఏకాదశి ఉపవాసం మోక్షం పొందడానికి మార్గం. అందువల్ల ఏకాదశి రోజు ఉపవాసం ఉండేందుకు సంకల్పం తీసుకోండి. ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే సాత్విక ఆహారం తీసుకోండి.
ఏకాదశి పూజకు అవసరమయ్యే పూజాసామగ్రి
- శ్రీమహావిష్ణువు చిత్రపటం
- పువ్వులు
- టెంకాయ
- వక్క
- పండ్లు
- లవంగం
- దీపం
- దూపం
- నెయ్యి
- పాలు
- తులసీ దళాలు