krishna janmashtami puja time: కృష్ణాష్టమి పూజ మీరుండే నగరాన్ని బట్టి ఎన్ని గంటలకు చేయాలో తెలుసుకోండి
krishna janmashtami puja time: ఈ రోజు శ్రీకృష్ణుడి జన్మదినం. ఆయనను ఎప్పుడు పూజించాలి? శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసుకోండి. మీరు నివసించే నగరాన్ని బట్టి కూడా పూజ చేసే సమయం ఆధారపడి ఉంటుంది.
జన్మాష్టమి 2024: శ్రీ కృష్ణ జన్మాష్టమి… ఇది భాద్రపద శ్రావణ మాసంలో కృష్ణ పక్షం అష్టమి తిథి నాడు వస్తుంది. శ్రీకృష్ణుని 5251వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ పండుగకు సంబంధించి శుభ ముహూర్తాలు, నగరాల వారీగా సమయాలు, పూజాసమాగ్రి, ముఖ్యమైన ఆచారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
కృష్ణ జన్మాష్టమి 2024 శుభ ముహూర్తం
ఈ సంవత్సరం హిందూ భక్తులు శ్రీకృష్ణుడి 5251 వ జయంతిని నిర్వహించుకుంటున్నారు. పంచాంగం ప్రకారం శుభ ముహూర్తం సమయాన్ని తెలుసుకోండి. ఏ సమయంలో గోపాలుడిని పూజించాలో తెలుసుకోండి.
నిషిత పూజ సమయం - రాత్రి 12:01 నుండి 12:45 వరకు, ఆగస్టు 27
అష్టమి తిథి ప్రారంభం - తెల్లవారుజామున 3:39, ఆగస్టు 26
అష్టమి తిథి ముగింపు - తెల్లవారుజామున 2:19, ఆగస్టు 27
అర్ధరాత్రి శుభ ముహూర్తం - రాత్రి 12:23, ఆగస్టు 27
రోహిణి నక్షత్రం ప్రారంభం- మధ్యాహ్నం 3.55, ఆగస్టు 26
రోహిణి నక్షత్రం ముగింపు సమయం - మధ్యాహ్నం 3:38, ఆగస్టు 27
పరాణ సమయం (ఉపవాసం ముగించే సమయం) - రాత్రి12:45, ఆగస్టు 27
చంద్రోదయ సమయం - రాత్రి 11:20, ఆగస్టు 26
కృష్ణ జన్మాష్టమి 2024 నగరాల వారీగా సమయాలు
న్యూఢిల్లీ - రాత్రి 12:01 నుండి 12:45 వరకు, ఆగస్టు 27
నోయిడా - మధ్యాహ్నం 12:00 నుండి
12:44 వరకు, ఆగస్టు 27
గుర్గావ్ - రాత్రి 12:01 నుండి 12:46 వరకు, ఆగస్టు 27
ముంబై - రాత్రి 12:01 నుండి 12:46 వరకు, ఆగస్టు 27
బెంగళూరు - రాత్రి 11.58 నుంచి 12.44 వరకు, ఆగస్టు 27
కోల్ కతా - రాత్రి 11.16 నుంచి 12.01 వరకు, ఆగస్టు 27
చండీగఢ్ - రాత్రి12:03 నుండి 12:47 వరకు, ఆగస్టు 27
పూణే - రాత్రి 12:13 నుండి 12:59 వరకు, ఆగస్టు 27
చెన్నై - రాత్రి 11:48 నుండి 12:34 వరకు, ఆగస్టు 27
జైపూర్ - రాత్రి 12:06 నుండి 12:51 వరకు, ఆగస్టు 27
హైదరాబాద్ - రాత్రి 11:06 నుండి 12:51 గంటల వరకు, ఆగస్టు 27
కృష్ణా జన్మాష్టమి పూజను నిర్వహించడానికి భక్తులకు శ్రీకృష్ణుని చిత్రపటాన్ని ఉంచేందుకు అరటి ఆకును వాడాలి. పూజకు గులాబీలు, గోధుమలు, బియ్యం, ఎర్ర తామర పువ్వులు, ధూపం, అగర్బత్తి, కుంకుమ, అబీర్, గులాల్, కేసర్, కపూర్, సింధూరం, చందన్, యజ్ఞోపవీతం, అక్షింతలు, తమలపాకులు, ఆకు వక్క, పసుపు, తులసి మాల, గంగా జలం, తేనె, , చక్కెర, ఆవు నెయ్యి, ఆవు పాలు అవసరం.
బాల కృష్ణుని విగ్రహం అలంకరణ కోసం చెవిపోగులు, గాజులు, దండ, బొట్టు, కాటుక, నెమలి ఈకలు, తలపాగా, సింహాసనం అవసరం.
టాపిక్