Subrahmanya Shashti: సర్వ దోషాల నుండి విముక్తి కావాలా..? సుబ్రహ్మణ్య షష్టి రోజున ఈ పరిహారాలు పాటించండి!
Subrahmanya Shashti: సుబ్రహ్మణ్య షష్టి హిందూ ధార్మిక పండుగలలో ఒక ముఖ్యమైన పర్వదినం. కార్తికేయ స్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఇది అనువైన రోజు. ఈ రోజున చేసే పూజలు, ప్రత్యేక పరిహారాలు సకల దోష నివారణకు, వివాహ, సంతాన సమస్యలకు పరిష్కారం చూపుతాయని నమ్మిక.
శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్య స్వామికి హిందూ పూరాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. కుమారస్వామి, మురుగన్ వంటి వివిధ పేర్లతో పిలుచుకునే సుబ్రహణ్య స్వామి విజయం, ధైర్యం, శక్తి, జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. సుబ్రహణ్య స్వామిని పూజిస్తే పట్టి దోష నివారణ, వివాహం, సంతాన సమస్యలన్నీ తీరతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్టి రోజున కుమారస్వామిని ఆరాధిస్తే పట్టి పీడిస్తున్న దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం సుబ్రహ్మణ్య షష్టి రోజు భక్తులు తమ జీవితంలో ఉన్న సమస్యలను నివారించేందుకు వివిధ పరిహారాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా సమస్యలు తొలగుతాయని, శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. ఈ రోజున పాటించాల్సిన పరిహారాలు, చేయకూడాని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
సుబ్రహ్మణ్య షష్టి తిథి:
పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్గశిర శుద్ధ షష్టి ఈ డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 గంటలకు మొదలవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథినే పరిగణలోకి తీసుకోవాలి కనుక డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్టి పండుగలనే జరుపుకోవాలి.
సుబ్రహ్మణ్య షష్టి రోజు చేయాల్సిన పరిహారాలు:
1. ఈ రోజు ఉపవాసం చేయడం అత్యంత శ్రేయస్కరం. ఇది శరీరాన్ని, మనసును పవిత్రంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
2. సుబ్రమణ్య ష్టష్టి రోజున స్వామికి ఇష్టమైన పంచామృతం లేదా పాయసం వంటి పాలతో తయారు చేసిన ప్రసాదాలు, లడ్డూలను స్వామి సమర్పించాలి.
3. కుమార స్వామి ఆరాధనలో కావడి మాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. సుబ్రహ్మణ్య షష్టి తిథి రోజున స్తానిక ఆలయాల్లో స్వామికి కావడి మాలడం సమర్పించడం వల్ల శక్తి, ధైర్యం పెరుగుతాయి. సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది.
4. జాతకంలో సర్పదోషం ఉన్నవారు ఈ రోజు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా విముక్తి పొందుతారని నమ్మకం. ముఖ్యంగా రాహు-కేతు గ్రహాల ప్రభావం తగ్గించేందుకు సుబ్రహ్మణ్యునికి పాలాభిషేకం చేయడం లేదా అష్టనాగ పూజ నిర్వహించడం శ్రేయస్కరంగా ఉంటుంది.
5.శత్రు సమస్యలతో బాధపడుతున్నవారు సుబ్రహ్మణ్య షష్టి రోజు స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి, ప్రత్యేక అర్చనలు చేయడం ద్వారా శత్రువుల ప్రభావం తగ్గుతుందని నమ్మకం.
6.సంతాన సమస్యలున్న వారు ఈ రోజు కుమారస్వామికి పాలు, తేనె, పంచామృతం, పాలు, గంగాజలంతో అభిషేకం చేయడం అత్యంత శుభ ఫలితాలను కలిగిస్తుందని, ఈ రోజున స్వామిని పూజించడం వల్ల సంతానం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
7. వివాహంలో ఆలస్యం ఉన్నవారు ఈ రోజు స్వామి పాదాలకు తులసి దళాలు, వేటివేరు కలిపి సమర్పించడం ద్వారా వివాహం జరుగుతుందని నమ్మకం.
8. సుబ్రహ్మణ్య షష్టి రోజున స్వామి కీర్తనలు, భజనలు చేయడం సుబ్రహ్మణ్య స్వామి మంత్రాలను భక్తితో పఠించడం వల్ల ఆధ్మాత్మిక శక్తి పెరుగుతుంది. మానసిక శాంతి కలుగుతుంది.
9. ఈ రోజున కుమార స్వామి పూజలో దీపారాధనతో పాటు 16 రకాల పూజా సమాగ్రి సమర్పించడం అత్యంత శుభదాయకంగా భావిస్తారు.
సుబ్రహ్మణ్య షష్టి రోజున చేయకూడని పనులు
- సుబ్రహ్మణ్య షష్టి రోజున స్నానం చేయకుండా రోజును మొదలు పెట్టకూడదు.శారీరకంగా, మానసికంగా పరిశుభ్రతను పాటించాలి.
- ఈ రోజున వ్రతం పాటించే వారు అఖండ ఉపవాసం ఉండడం ఉత్తమం.
- సుబ్రహ్మణ్య స్వామి పూజ రోజున మాంసాహారం తినకూడదు, మద్యం ముట్టుకోకూడదు, ధూమపానం జోలికి పోకూకడదు.
- సుబ్రహ్మణ్య షష్టి రోజున ఉపవాసం వ్రతం చేసే వారు ఆలయాలకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం కాదు. ఈ రోజున స్వామి ఆలయ దర్శనం తప్పనిసరి. ఆలయాలకు వెళ్లడం వల్ల భక్తి భావం - ఈ ఈ పవిత్రమైన రోజున అసత్యం చెప్పడం, ఇతరులను మోసగించడం, దుర్భాషలాడటం చాలా పెద్ద తప్పు.
- సుబ్రహ్మణ్య షష్టి రోజున నిరాశ, బాధ వంటి ఆలోచనలు చేయకూడదు. ఈ రోజును పాజిటివ్ ఆలోచనలతో గడపాలి. దేవుడిని నమ్మకంగా అడిగితేనే కోరికలు తీరతాయి.
- ఈ రోజు ఇంటి ముందుకు వచ్చిన బిక్షగాళ్లకు , పేద వారికి ఆహారం, అవసరమైన వస్తువులు ఇవ్వకుండా ఉండకూడదు. ఇది పెద్ద పాపకార్యంగా పరిగణించబడుతుంది.
- సుబ్రహ్మణ్య షష్టి రోజున శత్రువుల బాధను, ఓటమిని కోరుకోకూడదు. ఇది దేవుడికి ఆగ్రహం కలిగిస్తుంది.
- సుబ్రహ్మణ్యు పూజా సందర్భంలో విరక్తి, అపచారాలు చేయడం తప్పు.
- ఈ రోజున ఉపవాస దీక్షలో లేని వారి సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది.