సుబ్రహ్మణ్య స్వామికీ పాములకూ ఉన్న సంబంధం ఏంటి? స్వామి ఆరాధనలో సర్పాలకు ఎందుకంత ప్రాధాన్యత?
సుబ్రహ్మణ్య స్వామి, పాములకు మధ్య సంబంధం ఆసక్తికరమైన పౌరాణిక కథలతో ముడిపడి ఉంది. కేవలం కథతో మాత్రమే అయిపోలేదు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన ప్రతిసారి, ఆయనకు సమర్పించిన నైవేద్యాలు, పూజల్లో సర్పాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
పరమశివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కార్తికేయ లేదా మురుగన్ అని కూడా పిలుస్తుంటారు. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి యుద్ధానికి, శక్తికి దైవంగా భావిస్తారు.సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల అన్నింటా విజయం లభిస్తుందని, శక్తి పెరుగుతుందని, సర్ప దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. సుబ్రహ్మణ్య స్వామికీ పాములకు ఉన్న సంబంధం ఏంటి, స్వామిని ఆరాధనలో సర్పాలకు అంత ప్రాధాన్యత ఎందుకు. కుమారస్వామిని ఆరాధిస్తే సర్పదోషాలు ఎందుకు తొలగిపోతాయి వంటి విషయాల గురించి ఆధ్యాత్మిక శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
సుబ్రహ్మణ్య స్వామికీ సర్పాలకు మధ్య ఉన్న సంబంధం:
పురాణాలలో సర్పం అనేది శక్తిని, అంతర్గత శాంతిని సూచించేది. అంతేకాకుండా సర్పం దుష్టశక్తులను ప్రతీకగా కూడా కొన్ని సందర్భాల్లో పేర్కొన్నారు. వీటి ఆధారంగా చూస్తే క్షీర సాగర మథనం జరుగుతున్న సమయంలో దేవతలు, దుష్టగ్రహాలకు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో పాములు ప్రతికూల ఆలోచనలతో నిండి ఉండేవి. అమృతాన్ని తామే దక్కించుకోవాలని దేవతలో పోరాడుతూ ఉండేవి. ఆ సమయంలో యోథుడైన సుబ్రహ్మణ్య స్వామి తన సామర్థ్యం, శక్తులను ఉపయోగించి ఆ దుష్టసర్పాలను ఓడిస్తాడు. పాముల్లోని దుష్ట శక్తులన్నింటినీ కుమారస్వామి నాశనం చేస్తాడు. అలా స్వామి చేతిలో ఓడిపోయి తమ గర్వాన్ని కోల్పోయిన సర్పాలు ఆయన్ని తమ అధిపతిగా అంగీకరించి దేవతలపై దాడిని ఆపేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వాటిని తృణప్రాయంగా గెలిచి సర్పాలకు దేవుడిగా మారాడు. అలా స్వామి ఆరాధనల్లో సర్పాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. స్వామి పూజలో వారికి ప్రత్యేక స్థానం లభిస్తూ వస్తుంది.
వైష్ణవ ఆలయాల్లోనూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరాల్లోనూ సర్పాలను ఆరాధిస్తుంటారు. అంతేకాకుండా నాగదోషం ఉన్న వారు సుబ్రహణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే ఆ దోషాలు పోతాయని విశ్వసిస్తారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాలలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆలయాల్లో, సర్పాలను పూజించడం ముఖ్యమైన, ప్రాచీన సంప్రదాయంగా మారింది. సర్పదళ పూజలు లేదా సర్పం సర్వహారాలు వంటి సుప్రసిద్ధమైన పూజలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే తొలిపూజ అందుతుంది. ఈ పూజలనేవి పాపాలను నివారించడానికి, రోగాల నుండి రక్షణ పొందడానికి, మానసిక శాంతిని సాధించడానికి నిర్వహిస్తారు.
సుబ్రహ్మణ్య షష్టి ప్రాముఖ్యత:
హిందూ పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు షష్టి తిథి చాలా అనువైనది. ప్రతి మాసంలో షష్టి తిథి వస్తున్నప్పటికీ మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే షష్టికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ రోజున కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుడిపై విజయం సాధించిన రోజు. ఈ రోజున చెడుపై మంచి గెలిచినందున ఈ తిథిని సుబ్రహ్మణ్య షష్టి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున చేసే ప్రత్యేక పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చెడుపై విజయం దక్కించేందుకు సహాయపడతాయని నమ్మిక. అలాగే స్వామి సర్పాలకు అధిపతి కనుక ఈ రోజున స్వామిని ఆరాధిస్తే సర్ప దోషాలు తొలగిపోతాయని విశ్వాసం నెలకొంది.
సుబ్రహ్మణ్య షష్టి తిథి:
ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్టి తిథిని సుబ్రహ్మణ్య షష్టిగా జరుపుకుంటారు. పంచారం ప్రకారం.. ఈ ఏడాది డిసెంబర్ 6న సుబ్రహ్మణ్య షష్టి వచ్చింది. ఈ రోజున నియమ నిష్టలతో స్వామిని పూజించడం ద్వారా నాగ దోషాలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి, పెళ్లి కాని వారికి, శత్రు పీడితులకు పరిష్కార మార్గాలు దొరుకుతాయని విశ్వాసం.