అపర ఏకాదశి వ్రత కథ.. ఉపవాస ఫలం పొందేందుకు ఈ కథ తప్పక తెలుసుకోండి-know apara ekadashi vrath story and get virtue from the fasting ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Know Apara Ekadashi Vrath Story And Get Virtue From The Fasting

అపర ఏకాదశి వ్రత కథ.. ఉపవాస ఫలం పొందేందుకు ఈ కథ తప్పక తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
May 15, 2023 02:31 PM IST

అపర ఏకాదశి వ్రత కథ: అపర ఏకాదశి రోజున ఈ కథ చదవడం వల్ల ఉపవాస ఫలం లభిస్తుంది.

ఏకాదశి రోజున విష్ణు మూర్తిని పూజించాలి
ఏకాదశి రోజున విష్ణు మూర్తిని పూజించాలి

అపర ఏకాదశి జ్యేష్ట మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి. ఈరోజు మే 15న అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఏకాదశి తిథి ప్రతినెలా రెండుసార్లు వస్తుంది. ఒకటి కృష్ణపక్షంలో, మరొకటి శుక్లపక్షంలో వస్తుంది. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశి తిథులు వస్తాయి. అపర ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈరోజు తప్పక ఒక కథను చదవాలి. ఈ వ్రత కథ చదవడం వల్ల ఉపవాసం వల్ల ప్రయోజనం కలుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

అపర ఏకాదశి వ్రత కథ

మహా విష్ణువు అనుగ్రహాన్ని ప్రసాదించే ఉపవాస కథ ఇది. మహిధ్వజుడు అనే నీతిమంతుడైన రాజు ఉండేవాడు. రాజు తమ్ముడు వజ్రధ్వజుడు అన్నయ్యను ద్వేషించేవాడు. ఒకరోజు అవకాశం చూసుకుని రాజును చంపి అడవిలో రావిచెట్టు కింద పూడ్చిపెడతాడు. అకాల మరణంతో రాజు ఆత్మ దెయ్యంగా మారి రావిచెట్టుపై జీవించడం ప్రారంభించింది.

ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి వ్యక్తిని ఆత్మ కలవరపెడుతుంది. ఒకరోజు ఒక మహర్షి ఈ మార్గం గుండా వెళుతున్నాడు. వారు ఈ దెయ్యాన్ని చూసి అది దెయ్యంగా మారడానికి గల కారణాన్ని తమ తపోబలంతో తెలుసుకున్నారు.

మహర్షి రావిచెట్టు నుంచి రాజు ఆత్మను కిందకు దించి పరలోక విద్యను బోధించారు. రాజుకు విముక్తి కలిగించడానికి రుషి స్వయంగా అపర ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఉపవాసం పూర్తయిన తరువాత ఉపవాస సద్గుణాన్ని దెయ్యానికి ఇచ్చారు. ఏకాదశి వ్రతం పుణ్యం పొందిన తరువాత రాజు దెయ్యం నుంచి విముక్తి పొంది స్వర్గానికి వెళతాడు.

అంటే ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఏకాదశి ఉపవాస మహత్మ్యం తెలుసుకునేందుకు ఈ కథ ఉపయోగపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం