Kitchen Vastu Tips: వంట గదిలో ఎట్టిపరిస్థితుల్లో ఈ 10 పొరపాట్లు జరగకుండా చూసుకోండి.. ఇక మీ ఇబ్బందులు తీరినట్టే
Kitchen Vastu Tips: వాస్తు ప్రకారం వంటగదిలో ఈ తప్పులు చేయకండి. వంట గదిలో ఎట్టిపరిస్థితుల్లో ఈ 10 పొరపాట్లు జరగకుండా చూసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండొచ్చు. మరి మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చూసుకోండి.

Kitchen Vastu Tips: వంట గదిలో చేయకూడని 10 తప్పులు (pinterest)
చాలామంది తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ, వాస్తు ప్రకారం జాగ్రత్తగా మనం అనుసరిస్తే సమస్యలన్నీ తీరుతాయి. వాస్తు ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని పొరపాట్లను చేయకూడదు. వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ తప్పులు చేయకండి
- వాస్తు ప్రకారం వంటగదిని ఈశాన్యం, నైరుతి వైపు ఉండకుండా చూసుకోవాలి. లాగే వాస్తు ప్రకారం వంటగది ఇంటి మధ్యలో కూడా ఉండకూడదు.
- వంట గదిలో ఉండే స్టవ్ ఎప్పుడూ కూడా బయట నుంచి చూస్తే కనపడకుండా ఉండాలి.
- వంట గది ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉంటే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళల కెరియర్ పై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
- వంటగది పైన, కింద, పక్కన ఎట్టి పరిస్థితుల్లో బాత్రూం ఉండకూడదు. ఇలా ఉంటే కూడా సానుకూల శక్తి కలగదు. ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- ఇంటి ముఖద్వారం వైపు వంట గది తెరిచి ఉండకూడదు. అలా ఉంటే కూడా సానుకూల శక్తి ప్రవేశించదు.
ఈ పొరపాట్లు కూడా చేయకూడదు
- వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. వంటగదిలో మనం వాడే పొయ్యి కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. లేదంటే ప్రతికూల ప్రభావం కలుగుతుంది.
- వంట చేసేటప్పుడు మీరు తూర్పు వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఈ దశలో వంట చేస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇలా వంట చేయడం వలన అనారోగ్య సమస్యలు ఉండవు. మానసిక ఒత్తిడి నుంచి కూడా బయటపడొచ్చు.
- వంటగదిలో కిటికీలు ఎప్పుడూ కూడా పెద్దవిగా ఉండేటట్టు చూసుకోవాలి.
- ఇంటి ఆగ్నేయ దిశలో అగ్ని ఉంటే చాలా మంచి జరుగుతుంది. దీనిని శుభప్రదంగా భావిస్తారు.
- వంట గదిలో ఉంచే మసాలా దినుసులు, ధాన్యాలు వంటి వాటిని నిల్వ ఉంచుకోవడానికి వాయువ్యం మంచిది.
- వంటగదిలో పాత్రలని దక్షిణం లేదా పడమర వైపు ఉంచితే శుభ ఫలితాలను పొందవచ్చు.
- ఇంట్లో ఉండే బరువైన వస్తువులు దక్షిణం వైపు లేదంటే పడమర వైపు ఉండొచ్చు.
- తూర్పు, ఉత్తరం వైపు ఏదైనా కాంతి వస్తువు పెడితే సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
- ఇంట్లో వంటగది ఎప్పుడూ మెట్ల కింద ఉండకూడదు. అలా ఉంటే అప్పుల బాధ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- వంట గదిలో విరిగిపోయిన సామాన్లు, పాత సామాన్లు వంటివి ఉండకూడదు.
- చాలా మంది వంటగదిలో మందులని పెడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. వంటగదిలో మందులు పెడితే అది సానుకూల శక్తిని అడ్డుకుంటుంది. ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం
ఇంకా జ్యోతిషంగ్రహ సంచారం, దేవాలయాలు, వాస్తు శాస్త్రం, జ్యోతిష పరిహారాలు, ఆధ్యాత్మిక సమాచారం, పండగలు, పూజా విధానం, వ్రత విధానం, రాశి ఫలాలు వంటి కథనాలు చదవండి.