హిందూ ధర్మంలో సంతోషకరమైన జీవితానికి అనేక సూచనలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ఇంటికి, జీవితానికి సంబంధించిన అనేక విషయాలకు సలహాలు, పరిష్కారాలను సూచిస్తుంది. సంతోషం, శాంతిని కాపాడుకోవడానికి వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం.
వాస్తు శాస్త్రం ప్రకారం, వస్తువులను అమర్చడం ద్వారా సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుకోవచ్చు. దీనివల్ల జీవితంలోని సమస్యలు తగ్గుతాయి. నెగెటివిటీ తొలగిపోతుంది, కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
వాస్తు శాస్త్రంలో వంటగదిలోని వస్తువులను సరైన ప్రదేశంలో ఉంచాలని చెప్పబడింది. ఇలా చేయడం వల్ల జీవితంలో సంపద, సంతోషం ఉంటాయని నమ్ముతారు. వాస్తు నియమాల ప్రకారం, వంటగదిలో ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలో తెలుసుకుందాం.
1. వాస్తు ప్రకారం, మిక్సీ, మైక్రోవేవ్ వంటి విద్యుత్తు పరికరాలను వంటగదిలో అగ్ని దిశలో ఉంచాలి.
2. వంటగది తూర్పు, ఉత్తర దిశల్లో తేలికైన వస్తువులను ఉంచవచ్చు.
3. మీరు దక్షిణ లేదా పడమర దిశలో వంటిట్లో వాడే పాత్రలను ఉంచవచ్చు. ఈ దిశలో బరువైన వస్తువులను కూడా ఉంచవచ్చు.
4. వాస్తు శాస్త్రం ప్రకారం, వంట చేసేటప్పుడు ఎల్లప్పుడూ తూర్పు వైపు ముఖం చేయాలి. వంటగది స్టవ్ ప్రధాన తలుపు నుండి కనిపించకూడదు.
5. వంట గది తూర్పు లేదా అగ్ని మూలలో స్టవ్ ఉంచాలి. వంటగదిలో పెద్ద ప్రకాశవంతమైన లైట్లు మరియు పెద్ద కిటికీలు ఉండాలి.
6. వంటగదిలో వస్తువులను పెట్టడానికి ఉంచే షెల్ఫ్ దక్షిణ లేదా పడమర దిశలో ఉండాలి.
7. మసాలా దినుసులు, ఆహార పదార్థాలను వాయువ్య దిశలో ఉంచవచ్చు అని వాస్తు చెప్తోంది.
8. వంటగది ఈశాన్య మూలలో ట్యాంక్, వాష్ బేసిన్, త్రాగునీరు ఉంటే శుభప్రదం.
9. వాస్తు శాస్త్రంలో, నీరు మరియు అగ్నిని శత్రువులుగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో విభేదాలను పెంచుతుంది. కాబట్టి, రిఫ్రిజిరేటర్, గ్యాస్ స్టవ్‌ను వేరు వేరు ప్రదేశాలలో దూరంగా ఉంచాలి. రిఫ్రిజిరేటర్‌ను వాయువ్య దిశలో ఉంచవచ్చు.
10. వాస్తు నియమాల ప్రకారం నేల తుడవడానికి ఉపయోగించే మాప్ వంటి శుభ్రపరిచే వస్తువులను వంటగది నైరుతి మూలలో ఉంచవచ్చు. అంతేకాకుండా, ఎల్లప్పుడూ చెత్త బుట్టను వంటగది నుండి బయట ఉంచండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం