ఈ నాలుగు అక్షరాల పిల్లలు ఎప్పుడూ టాప్ లో ఉంటారు!-kids whose names starts with these letters will be always top in any field ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ నాలుగు అక్షరాల పిల్లలు ఎప్పుడూ టాప్ లో ఉంటారు!

ఈ నాలుగు అక్షరాల పిల్లలు ఎప్పుడూ టాప్ లో ఉంటారు!

Peddinti Sravya HT Telugu

పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి మనకి తెలియని చాలా విషయాలని మనం తెలుసుకోవడానికి కూడా అవుతుంది. ఈ నాలుగు అక్షరాల పిల్లలు చాలా తెలివైన వారు, ప్రతి రంగంలో కూడా టాప్ లోనే ఉంటారు. మరి వీరిలో మీ పిల్లలు కూడా ఉన్నారేమో చూసుకోండి.

ఈ నాలుగు అక్షరాల పిల్లలు ఎప్పుడూ టాప్ లో ఉంటారు! (pinterest)

మనిషి పేర్లు ప్రకారం మనం చాలా విషయాలని తెలుసుకోవచ్చు. పేర్లు కేవలం పిలవడానికి కాదు. అవి మనిషి ప్రవర్తన, తీరు ఎలా ఉంటాయనేది కూడా చెప్తాయి. మన పేరులోని మొదటి అక్షరం మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది చెప్తుంది. అలాగే పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి మనకి తెలియని చాలా విషయాలని మనం తెలుసుకోవడానికి కూడా అవుతుంది.

ఈ నాలుగు అక్షరాల పిల్లలు చాలా తెలివైన వారు, ప్రతి రంగంలో కూడా టాప్ లోనే ఉంటారు. మరి వీరిలో మీ పిల్లలు కూడా ఉన్నారేమో చూసుకోండి.

ఈ అక్షరాల పిల్లలు ఎప్పుడు టాప్ లో వుంటారు

1.కె అక్షరం

పిల్లల పేరు కె అక్షరంతో మొదలవుతున్నట్లయితే, వారు ఎంతగానో కష్టపడతారు. ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరిస్తారు. ప్రతి సమస్యను ఎలా పరిష్కరించాలనేది వీరికి బాగా తెలుసు. తల్లిదండ్రులకు ఎంతో దగ్గరగా ఉంటారు.

2.సి అక్షరం

సి అక్షరం వారు చిన్నప్పటి నుంచి చదువు మీద దృష్టి పెడతారు. పరీక్షల్లో పాల్గొనడానికి కూడా భయపడరు. ఎటువంటి పరీక్షలు రాయడానికి ఇష్టపడతారు. కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికను తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.

3.పి అక్షరం

మీ పిల్లల పేరు పి అక్షరంతో మొదలవుతున్నట్లయితే వారు చాలా ధైర్యంగా ఉంటారు. అన్ని వయసుల వారితో మాట్లాడడానికి ఇష్టపడతారు. వారు వారి కష్టార్జితంతోనే జీవితంలో పురోగతిని సాధిస్తారు. చదువు గురించి ఆందోళన చెందుతారు. అందుకనే ఎప్పుడూ చదువు మీద దృష్టి పెడతారు.

4.ఏ అక్షరం

పిల్లల పేరు ఏ అక్షరంతో మొదలవుతున్నట్లయితే, వారు చదువులో బాగా రాణిస్తారు. కలల్ని కూడా నెరవేర్చుకుంటారు. తల్లిదండ్రులు, ఇంట్లో కుటుంబ సభ్యులు అందరిని వీరు ఎక్కువగా ప్రేమిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.