Ketu Transit: ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో కేతు సంచారం.. ఈ నాలుగు రాశుల వారికి ఒత్తిడి, కష్టాలు తప్పవు
రహస్య కదలికలకు పెట్టింది పేరుగా చెప్పుకునే కేతు సంచారం చాలా రాశుల వారిపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఈ ఏడాది నవంబరు 10న కేతువు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో సంచరిస్తుంది. ఈ సంచారం నాలుగు రాశుల వారికి కష్టాలను తెచ్చిపెడుతుంది.
నీడ గ్రహంగా చెప్పుకునే కేతువు కదలికల్లో మార్పులు ఎప్పుడూ ఊహించని రీతిలో ఉంటాయి. కేతు సంచారం చాలా రాశుల వారిపై ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు వంటి విషయాలను ప్రభావితం చేస్తుంది. ఈ నవంబరు 10న కేతువు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. దీని ప్రభావం కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాను అందించనప్పటికీ, మరికొందరికి మాత్రం తీవ్ర ప్రతికూల ఫలితాలను తెచ్చిపెడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కేతువు ఉత్తఫాల్గుని నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఈ సారి ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఒత్తిడి, కష్టాలు తప్పవట. కేతు సంచారంలో మార్పు వల్ల ఏ రాశుల వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం.
మేష రాశి:
ఉత్తర ఫాల్గుని నక్షత్రాన్ని సూర్యుడు పాలిస్తాడు. నీడ గ్రహమైన కేతువు సూర్యుడికి విరుద్ధమైన సంబంధం కలిగి ఉంటుంది. ఉత్తర ఫాల్గునిలోకి కేతువు ప్రవేశించడం వల్ల మేష రాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత సంబంధాలలో కూడా ఒత్తిడి ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో కూడా విభేదాలు ఏర్పడతాయి. స్థానికులు, సన్నిహితులకు దూరమయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి.
మిథున రాశి:
కేతువు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మిథున రాశిలో జన్మించిన వారికి ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. ఊహించని ఖర్చులు, నష్టాలు వచ్చి పడతాయి. లాభాలు నిలిచిపోతాయి. పొదుపులు, ఆదాయ వనరులు ఆశించిన బలంగా ఉండకపోవచ్చు. వ్యక్తితంగా, కుటుంబ సభ్యులు, భాగస్వాములతో సంబంధాలు దెబ్బతింటాయి. ఇంట్లో శాంతి, సామరస్యం నశించి వివాదాలు రేకెత్తుతాయి. వ్యాపార పరంగా కూడా అవకాశాలకు అడ్డంకులు ఏర్పడతాయి. ఖర్చున విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత కాలం పాటు సహనం పాటించాలి.
కర్కాటక రాశి:
ఈ రాశి వారికి కేతువు సంచారం వల్ల పని భారం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. ఆదాయ వనరులు కూడా అస్థిరంగా మారతాయి. ఆర్థికంగా కూడా ఊహించిన దానికంటే తక్కువ లాభాలే కనిపిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, అదనపు టార్గెట్లు వచ్చి పడి ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు కూడా తక్కువ రాబడిచ్చే అవకాశాలున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన సమయం కాదు. పెద్ద పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు చదువులో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.
మీన రాశి:
కేతువు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మీనరాశి వ్యక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతాయి. కనుక ఆహారం, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఈ సమయంలో ప్రేమ వ్యవహారం, వైవాహిక జీవితం, కుటుంబ సంబంధాల్లో కూడా అపార్థాలు తలెత్తుతాయి. ఆర్థికంగా కూడా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు రాకపోవచ్చు. పెట్టుబడులు, ఖర్చు విషయంలో ఆచూతూచీ వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్