కేతువు గ్రహాల రాజు అయినటువంటి సూర్యుడు రాశి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. సింహ రాశిలో కేతువు సంచారం 12 రాశుల వారి జీవితంలో అనేక శుభ, అశుభ ప్రభావాలను తీసుకువస్తుంది. క్రూరమైన, పాపాత్మక గ్రహాలు అయినటువంటి రాహువు, కేతువులు ఎప్పుడూ కూడా వెనక్కి సంచరిస్తాయి. ఒకటిన్నర సంవత్సరాల్లో రాహువు, కేతువు సంచారం జరుగుతుంది.
మే 18న కేతువు సింహరాశిలోకి ప్రవేశించి మూడు రాశు చక్రాల వారిపై ప్రభావం చూపిస్తాడు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి. కేతువు రాశి మార్పుతో కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. 12 రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ కొన్ని రాశుల వారు లాభాలను పొందుతారు. ఈ రాశుల వారి జీవితంలో ఎటువంటి ప్రభావాలు చోటుచేసుకుంటాయో ఇప్పుడే తెలుసుకుందాం.
మే 2025 లో కేతువు రాశి మార్పు వృషభ రాశి వారికి అనేక ప్రయోజనాలను తీసుకువస్తుంది. ధన లాభంతో పాటుగా కొత్త వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. కెరియర్ లో సక్సెస్ ఉంటుంది. బంధాలు కూడా బలంగా మారుతాయి.
కేతువు రాశి మార్పు తులా రాశి వారికి కూడా అనేక లాభాలను తీసుకువస్తుంది. ముఖ్యంగా తులా రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ప్రభుత్వ స్కీములు, ఇన్వెస్ట్మెంట్ల నుంచి కూడా లాభాలు ఉంటాయి. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.
కర్కాటక రాశి వారు కేతువు రాశి మార్పుతో ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. రానున్న ఏడదిన్నర పాటు ఆర్థిక లాభంతో పాటుగా కెరియర్ లో సక్సెస్ ని అందుకుంటారు. జీవితంలో పాజిటివిటీ ఉంటుంది. బిజినెస్ లో కూడా లాభాలు ఎక్కువగా వస్తాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం