మరో నాలుగు రోజుల్లో పూర్వాభాద్ర నక్షత్రంలోకి కేతువు.. ఈ మూడు రాశులకు డబ్బు, వాహనాలు ఇలా ఎన్నో!-ketu transit in purvabadra nakshatram in four days it gives lots of benefits to tarus aquarius and libra ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మరో నాలుగు రోజుల్లో పూర్వాభాద్ర నక్షత్రంలోకి కేతువు.. ఈ మూడు రాశులకు డబ్బు, వాహనాలు ఇలా ఎన్నో!

మరో నాలుగు రోజుల్లో పూర్వాభాద్ర నక్షత్రంలోకి కేతువు.. ఈ మూడు రాశులకు డబ్బు, వాహనాలు ఇలా ఎన్నో!

Peddinti Sravya HT Telugu

కేతువు జూలై 6 మధ్యాహ్నం 1:32 గంటలకు పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. 20వ తేదీ మధ్యాహ్నం 2.10 గంటల వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. తువు నక్షత్ర సంచారం వల్ల ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మరో నాలుగు రోజుల్లో పూర్వాభాద్ర నక్షత్రంలోకి కేతువు

కేతువు జూలై 6 మధ్యాహ్నం 1:32 గంటలకు పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. 20వ తేదీ మధ్యాహ్నం 2.10 గంటల వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. కేతువు నీడ గ్రహం. ఆయన కూడా తిరోగమనవాది.

కేతువు నక్షత్ర సంచారం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి ఇది అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.

కేతువు నక్షత్ర సంచారం మూడు రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో, ఈ మూడు రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. కొత్త అవకాశాలతో పాటు ఫైనాన్స్ పరంగా కూడా లాభాలు పొందుతారు. కేతువు నక్షత్ర సంచారం వల్ల ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కేతువు నక్షత్ర సంచారంతో ఈ మూడు రాశులకు ఎన్నో లాభాలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి కేతువు నక్షత్రం సంచారం అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కార్యాలయంలో మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఇంటర్వ్యూకు వెళ్లాలనుకునే వారికి ఈ సమయం బాగుంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇది ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.

2.కుంభ రాశి

కుంభ రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. కీర్తి పెరుగుతుంది. ఇది ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది. వారిని వెతుక్కుంటూ కొత్త అవకాశాలు వస్తాయి. మీరు విజయం సాధిస్తారు. సంతోషంగా ఉంటారు.

3.తులా రాశి

తులా రాశి వారికి కేతువు నక్షత్రం సంచారం శుభాన్ని తెస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు. జీతాలు పెరిగే అవకాశం ఉంది.

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో కూడా సానుకూల ఆలోచనలు ఉంటాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.