Ketu transit: సూర్యుడి నక్షత్రంలో కేతు సంచారం- రానున్న నాలుగు నెలలు వీరికి జాలీగా గడిచిపోతుంది
Ketu transit: కేతువు తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. సూర్యుడికి చెందిన ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు. దీని వల్ల మూడు రాశుల వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అదిరిపోయేలా ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో రాహు, కేతువులను దుష్ట గ్రహాలుగా పిలుస్తారు. ఇవి ఎల్లప్పుడూ తిరోగమన దశలో సంచరిస్తూ ఉంటారు. నిర్ధిష్ట కాలం తర్వాత కేతువు రాశితో పాటు నక్షత్రాన్ని మారుస్తాడు. గతేడాది కన్యా రాశిలోకి వచ్చిన కేతువు మరికొద్ది రోజులో ఇదే రాశిలో ఉంటాడు. అయితే ఇప్పుడు కేతువు తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు.
కేతువు నక్షత్రం మార్చడం వల్ల మొత్తం 12 రాశులపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. కేతువు నక్షత్ర మార్పు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో ఉండి ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. నవంబర్ 10వ తేదీ రాత్రి 11:31 గంటలకు కేతువు ఈ నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఉత్తర ఫాల్గుణి నక్షత్రానికి అధిపతి సూర్యభగవానుడు.
దృక్ పంచాంగ్ ప్రకారం కేతువు ఈ సంవత్సరం చివరి వరకు సూర్యుని రాశిలో ఉంటాడు. కేతువు ఈ నక్షత్రంలో ఫిబ్రవరి 7, 2025 వరకు ఉంటాడు. మొత్తం 27 నక్షత్రాలలో ఉత్తర ఫాల్గుణి నక్షత్రం పన్నెండవది. అటువంటి పరిస్థితిలో సూర్యుని రాశిలో కేతువు సంచరించడం వల్ల ఏ రాశుల వారు ప్రయోజనం పొందగలరో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
సూర్యుడి నక్షత్రంలో కేతువు సంచారం ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ కుటుంబం, పూర్వీకుల నుండి ఆశీర్వాదం పొందుతారు. సమాజంలో మీ స్థానం, ప్రతిష్ట పెరుగుతుంది. మీరు వ్యాపార సమస్యల నుంచి బయట పడి లాభాలను పొందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా క్రమంగా సమసిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు జీతం పెరుగుదల ఉంటుంది. తెలివితేటలు పెరుగుతాయి. రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కోర్టు కేసుల్లోనూ విజయం మీదే అవుతుంది.
మకర రాశి
కేతు నక్షత్ర సంచారం మకర రాశి వారికి లాభాలను తీసుకొస్తుంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. సంపద పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు మీ తల్లి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారస్తులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. వృత్తి రంగంలో అనేక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. అదృష్టం వరిస్తుంది. కుటుంబంలోని దీర్ఘకాలిక సమస్యలు సమసిపోతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారు కేతు సంచారం వల్ల ఏడాది చివర వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడుపుతారు. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారం చేసే వారికి శుభవార్తలు అందుతాయి. ఆస్తిలో ఏదైనా పాత పెట్టుబడి మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పూర్వీకుల నుంచి అస్తి వారసత్వంగా లభిస్తుంది. కుటుంబంలో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.