Ketu nakshtra transit: జ్యోతిష్య శాస్త్రంలో రాహు-కేతులను రహస్య గ్రహాలుగా పరిగణిస్తారు. వీటికి సొంత గ్రహం ఏది లేదు. ఏ గ్రహంలో ఉంటే దాన్ని ఆక్రమించుకుంటుందని చెబుతారు. శని మాదిరిగా రాహు కేతువులు అంటే అందరికీ భయం.
జాతకంలో ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండి, వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటాయి. కేతువు తిరోగమన దశలోనే సంచరిస్తుంది. శుభ స్థానంలో ఉంటే అకస్మాత్తుగా మనకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. అది చెడుగా ఉంటే మాత్రం ఊహించని విధంగా అశుభకరమైన సంఘటనలు జరుగుతాయి. ఈ సంఘటనలకు కేతువు కారణం.
ప్రస్తుతం కేతువు చంద్రుడికి చెందిన హస్తా నక్షత్రంలో ఉన్నాడు. జులై 8న కేతువు హస్తా నక్షత్రంలోని తృతీయ దశను వదిలి రెండవ దశలోకి ప్రవేశించాడు. సుమారు 63 రోజుల పాటు కేతువు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. కేతువు సెప్టెంబర్ 08 వరకు నక్షత్రంలోనే ఉంటాడు. అనంతరం కేతువు హస్తా నక్షత్రం మొదటి దశలో సంచరిస్తాడు. చంద్రుని నక్షత్రంలో కేతువు సంచారం వల్ల ఏ రాశుల వారి సంపద పెరుగుతుందో తెలుసుకోండి.
కేతువు నక్షత్ర మార్పు మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ధైర్యసాహసాలు, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దీనితో పాటు వ్యాపార, ఉద్యోగాలలో పురోగతికి అనేక అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఊహించని విధంగా ఆర్థిక లాభం ఉండవచ్చు. కేతువు ప్రభావం వల్ల మీ మనసులోని కోరిక నెరవేరుతుంది. దీంతో పట్టరాని సంతోషంతో ఉంటారు. ఉద్యోగులు ఆశించిన విధంగా ప్రమోషన్ లభిస్తుంది.
కేతువు నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది. సెప్టెంబర్ వరకు ఈ రాశి వారికి ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. కొత్త ఆదాయ వనరులను ఏర్పడతాయి. మీరు కార్యాలయంలో కొన్ని గొప్ప విజయాలు సాధిస్తారు. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మకర రాశి వారికి కేతువు సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందుతారు. వ్యాపారులకు ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ కాలం బాగానే ఉంటుంది. ధైర్యసాహసాలు పెరగడం వల్ల మీరు పనిలో విజయం సాధిస్తారు.
కేతువు నక్షత్ర మార్పు వల్ల మూడు రాశుల వారికి కష్టాలు పెరుగుతాయి. కన్య, తులా, కర్కాటక రాశుల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగులతో విభేదాలు తలెత్తుతాయి. అటు వైవాహిక జీవితంలోను సమస్యలు తలనొప్పిగా మారతాయి. అందువల్ల ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.