శుక్రుడు తన సొంత రాశి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీంతో కేంద్ర త్రికోణ యోగం, మాలవ్య రాజయోగం ఏర్పడ్డాయి. ఇవి శుభ యోగాలను, అశుభ యోగాలను కూడా అందిస్తాయి. 12 రాశుల వారికి ఈ యోగాల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు మాత్రం కేంద్ర త్రికోణ యోగం, మాలవ్య రాజయోగంతో ప్రయోజనాలను పొందుతారు.
ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. దృక్ పంచాంగం ప్రకారం శుక్రుడు జూన్ 29న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. జూలై 26 వరకు ఇదే రాశిలో సంచారం చేస్తాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి.
కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడినప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి. శుక్రుడు ఒకటి, నాలుగు, ఏడవ ఇంట్లో సంచరించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాల వలన కొన్ని రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి. మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
రెండు శుభయోగాలు, కేంద్ర త్రికోణ రాజయోగం, మాలవ్య రాజయోగం జూలై 26 వరకు ఉంటాయి. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. సంతోషంగా ఉండొచ్చు.
మేష రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం, మాలవ్య రాజయోగం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అదృష్టాన్ని పొందుతారు. సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో మీ వద్దకు రాని డబ్బు ఈ సమయంలో వస్తుంది. పాత ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ఎక్కువ రాబడిని పొందుతారు. ఆఫీసు, కుటుంబ జీవితం మధ్యముగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.
మకర రాశి వారికి రాజయోగం అదృష్టాన్ని తీసుకు వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి కూడా భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఈ సమయంలో ధన లాభం కూడా కలగవచ్చు. వ్యాపారానికి సంబంధించిన విషయంలో కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
మీన రాశి వారికి ఈ రెండు రాజయోగాలు శుభ ఫలితాలను అందిస్తాయి. ఈ సమయంలో మీన రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారులకు కూడా ఇదే మంచి సమయం. వైవాహిక జీవితంలో కూడా సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు. పెద్దల సలహా తీసుకుంటే పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.