Vastu Tips for Name Plate: జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి వాస్తు నియమాలు పాటించడం చాలా పవిత్రంగా భావిస్తారు. వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో వస్తువులను క్రమ పద్ధతిలో అమర్చడం, అలంకరించడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుందని నమ్ముతారు. జీవితంలో సానుకూల శక్తిని నింపుతుందని విశ్వసిస్తారు.
సరైన వాస్తు నియమాలు పాటించడం వల్ల ఒక వ్యక్తి ప్రేమ, వృత్తి, ఆర్థిక, ఆరోగ్యంతో సహా జీవితంలోని అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందుతాడు. కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందుతాడు. వాస్తు ప్రకారం ఇంటి వెలుపల అమర్చిన నేమ్ ప్లేట్ కుటుంబ సభ్యులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. నేమ్‌ప్లేట్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు వాస్తులోని కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ మధ్య కాలంలో నేమ్ ప్లేట్ ట్రెండ్ ఎక్కువగా ఉంది. అయితే ఇంట్లో ఎలాంటి నేమ్ ప్లేట్ పెట్టుకోవాలి? వాస్తు ప్రకారం ఏ దిశలో ఏర్పాటు చేయాలి? ఏ రంగు నేమ్ ప్లేట్ ఇంటికి అదృష్టాన్ని తీసుకు వస్తుంది అనే విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
వాస్తు ప్రకారం ఇంటి బయట దీర్ఘచతురస్రాకార నేమ్ ప్లేట్ పెట్టాలి.
నేమ్ ప్లేట్ అమర్చుకోవడం వల్ల ఇంటికి అదృష్టం, శ్రేయస్సు వస్తుంది. ఓవెల్ షేప్ ఆకారంలో ఉన్న నేమ్ ప్లేట్ తగిలించడం చాలా శుభప్రదం. ఇది ఇంటి ముందు తగిలించుకోవడం వల్ల అతిథులను ఆకట్టుకుంటుంది.
వృత్తాకార లేదా త్రిభుజాకార ఆకారపు నేమ్ ప్లేట్‌లను ఇన్‌స్టాల్ చేయడం మంచిది కాదు. ఇది ఇంటికి అశుభ ఫలితాలు ఇస్తుంది.
నేమ్‌ప్లేట్‌పై రాసిన పదాలు అస్పష్టంగా ఉండకూడదు. అన్ని పదాలు స్పష్టంగా కనిపించాలి. పెద్దవిగా ఉండే విధంగా చూసుకోవాలి.
వాస్తులో ఇంటి వెలుపల నేమ్ ప్లేట్ ఉంచడానికి ఉత్తరం లేదా తూర్పు దిక్కులు ఉత్తమ దిశగా పరిగణిస్తారు.
ఇది కాకుండా ఈశాన్య మూలలో నేమ్ ప్లేట్ కూడా ఉంచవచ్చు.
వాస్తులో ప్రధాన ద్వారం కుడి వైపున నేమ్ ప్లేట్ వేలాడదీయడం శుభప్రదంగా ఉంటుంది.
నేమ్ ప్లేట్ పగలకుండా లేదా రంధ్రాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి.
నేమ్ ప్లేట్‌పై వినాయకుడు లేదా స్వస్తిక్ చిహ్నం ఉండటం చాలా శుభప్రదం.
నేమ్ ప్లేట్ పాలిష్ రాలిపోయినా లేదా విరిగిపోయినా వెంటనే దాన్ని తీసివేయండి.
వాస్తు ప్రకారం నేమ్ ప్లేట్ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
మీరు ఇంట్లో రాగి, ఉక్కు లేదా ఇత్తడితో చేసిన నేమ్ ప్లేట్‌ను అమర్చవచ్చు.
ప్రధాన ద్వారం వద్ద ప్లాస్టిక్ లేదా రాయితో చేసిన నేమ్ ప్లేట్ ఏర్పాటు చేయకూడదని నమ్ముతారు.
తెలుపు, పసుపు, కుంకుమ కలిపిన రంగుల నేమ్ ప్లేట్ ధరించడం మంచిదని భావిస్తారు.
నేమ్ ప్లేట్ వెనుక సాలె పురుగు గూడు, బల్లి లేదా పక్షి నివసించకూడదని గుర్తుంచుకోండి.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్