Diwali 2024: దీపావళి రోజున ఈ ఏడు విగ్రహాలు లేదా బొమ్మలను ఇంట్లో ఉంచండి, డబ్బుకు లోటుండదు-keep these seven idols or idols at home on diwali money will not be lacking ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Diwali 2024: దీపావళి రోజున ఈ ఏడు విగ్రహాలు లేదా బొమ్మలను ఇంట్లో ఉంచండి, డబ్బుకు లోటుండదు

Diwali 2024: దీపావళి రోజున ఈ ఏడు విగ్రహాలు లేదా బొమ్మలను ఇంట్లో ఉంచండి, డబ్బుకు లోటుండదు

Haritha Chappa HT Telugu
Oct 23, 2024 10:00 AM IST

Diwali 2024: దీపావళి రోజున ఇంటిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. దీనివల్ల మీ ఇల్లు కూడా అందంగా కనబడుతుంది. దీపావళి రోజున కొన్ని విగ్రహాలు ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత, ఆనందం పెరుగుతుంది. ఏ విగ్రహాలను ఇంట్లో ఉంచితే మేలు జరుగుతుందో తెలుసుకోండి.

దీపావళి రోజు ఇంట్లో పెట్టాల్సిన విగ్రహాలు ఏమిటి?
దీపావళి రోజు ఇంట్లో పెట్టాల్సిన విగ్రహాలు ఏమిటి? (Shutterstock)

దీపావళి పండుగ సంతోషాన్ని, సంపదను, శ్రేయస్సును తెచ్చే పండుగ. ఈ పండుగ నాడు లక్ష్మీ దేవి, గణేశుడు, కుబేరుడిని పూజిస్తారు. ఈ పవిత్రమైన పండుగ రోజున, ప్రజలు తమ ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ఆరోజు ఇంటికి లక్ష్మీదేవికి స్వాగతం పలకడానికి సిద్ధం అవుతారు. అయితే, ఈ పండుగనాడు ఇంటిలోని ప్రతికూలతను తొలగించడానికి, సానుకూల శక్తితో పాటు సంతోషం, శ్రేయస్సు, ఆశీర్వాదాలను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. దీపావళి రోజు కచ్చితంగా కొన్ని విగ్రహాలను కొనుగోలు చేయండి. ఈ విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల సుఖసంతోషాలు నెలకొంటాయని, ఇంట్లో ధనానికి కొదవ ఉండదని నమ్ముతారు. ఏ విగ్రహాలను దీపావళి రోజు ఇంట్లో పెట్టాలో తెలుసుకోండి.

లక్ష్మీదేవి

ప్రతి ఇంట్లో లక్ష్మీ దేవి ఫోటో ఉంటుంది. లక్ష్మీ దేవి మట్టి విగ్రహాన్ని కూడా దీపావళి రోజు ఇంటికి తీసుకువస్తారు. కానీ లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఇంట్లో ఎల్లప్పుడూ ఉండేలా ఇత్తడి, వెండి లేదా రాగితో చేసిన విగ్రహాన్ని ఉంటే మంచిది. లక్ష్మీదేవి, విష్ణుమూర్తితో కలిసి ఉన్న విగ్రహం పెడితే ఎంతో ఉత్తమం.

గుడ్లగూబ

గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. కాబట్టి గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే సంపదకు కొదవ ఉండదని మత విశ్వాసం. వాస్తు దృష్ట్యా గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం కూడా శుభప్రదం. మీ ఇంట్లో గుడ్లగూబ విగ్రహం లేకపోతే, ఈ దీపావళికి ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని తీసుకురండి.

గణేశుడి విగ్రహం

వినాయకుడినే పూజలో మొదటిగా పూజలు అందుకుంటాడు. అడ్డంకులను తొలగించే గణేషుడిని పూజించడం అనుకున్న పనులను పూర్తిచేసుకోవచ్చు. దీపావళి సందర్భంగా, గణేషుడిని, లక్ష్మీదేవిని కలిసి పూజిస్తే ఎంతో మంచిది. గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఏ పనిలోనూ ఆటంకాలు ఉండవని, అందరూ పురోగతి సాధిస్తారని నమ్ముతారు.

ఏనుగు విగ్రహం

ఏనుగును చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది సంపద, కీర్తికి చిహ్నంగా చెప్పుకుంటారు. ఏనుగును వినాయకుడిగా కూడా పూజిస్తారు. ఇంట్లో రాగి, ఇత్తడి లేదా ఏనుగు వెండి విగ్రహాన్ని ఉంచడం చాలా మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇది ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది. దీని వల్ల ఆనందం, శ్రేయస్సు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాయి.

కామధేనువు

ధార్మిక, పౌరాణిక విశ్వాసాల ప్రకారం కామధేనువు సకల కోరికలను నెరవేరుస్తుంది. కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. కామధేనుడి విగ్రహం ఉన్న ఇంట్లో సంపదకు కొదవ ఉండదని చెబుతారు. ఇంటి సభ్యులందరి కోరికలు నెరవేరుతాయి.

క్రిస్టల్ లేదా మెటల్ పిరమిడ్

క్రిస్టల్ లేదా మెటల్ తో చేసిన పిరమిడ్ ను కూడా ఇంట్లో ఉంచాలి. ఇది ఇంటిలోని ప్రతికూలతను తొలగించి, ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. స్ఫటికం లేదా లోహంతో చేసిన పిరమిడ్ ను ఇంట్లో ఉంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని మత విశ్వాసం. కాబట్టి, ఈ దీపావళి సందర్భంగా, క్రిస్టల్ లేదా మెటల్ తో చేసిన పిరమిడ్ ను తీసుకువచ్చి ఇంట్లో ఉంచండి.

తాబేలు

శ్రీమహావిష్ణువు కూర్మ రూపంలో రెండో అవతారం ఎత్తాడు. అందువలన తాబేలుకు హిందూమతంలో ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఇత్తడి, రాగి లేదా వెండితో చేసిన తాబేలును ఇంట్లో ఉంచడం ద్వారా లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. ఆమె ఎల్లప్పుడూ ఇంట్లో నివసిస్తుంది. తాబేలు నీటి జీవి అని అందరికీ తెలుసు, కాబట్టి తాబేలును ఇంట్లో నీరు లేకుండా ఉంచకూడదని గుర్తుంచుకోండి.

Whats_app_banner