Goddess lakshmi devi: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే, ఆర్థిక ఇబ్బందులే ఉండవు
Goddess lakshmi devi: ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచుకుని వాటిని పవిత్రంగా చూసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. మీ ఇంటి సిరిసంపదలు నిలుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
Goddess lakshmi devi: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సుఖంగా, విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతాడు. చాలా సార్లు కొంతమంది విజయం సాధిస్తారు. మరికొందరు ఎంత కష్టపడినా కూడా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించలేరు.

ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకువచ్చి వాటిని పవిత్రంగా చూసుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోయి లక్ష్మీదేవి నివాసం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఉంచిన ఏ వస్తువులు సానుకూల శక్తిని తెస్తాయో తెలుసుకోండి. సంపద వృద్ధి చెంది సుఖమైన జీవితం గడపాలని అనుకుంటే ఈ వాస్తు నియమాలు పాటించి చూడండి. మీ లైఫ్ మారిపోయే అవకాశం ఉంది. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందగలుగుతారు.
గణేశుడి విగ్రహం
ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంచడం చాలా శ్రేయస్కరం. వాస్తు శాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. వాస్తు దోషాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరికాయ
వాస్తు శాస్త్రం ప్రకారం కొబ్బరి కాయను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. కొబ్బరికాయను ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదం. కొబ్బరికాయను ఉంచడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, సంపద చేకూరుతాయని చెబుతారు. జీవితంలో ఆనందం వస్తుంది. కొబ్బరికాయ లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. అందుకే దీన్ని ఇంట్లో పెట్టుకుంటే మంచిది.
శంఖం
పూజ గదిలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని వాస్తు శాస్త్రం చెబుతోంది. శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుంది. శంఖం పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి జీవితంలో సంతోషం కలుగుతుంది. శంఖం పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరిచి దాని మీద శంఖం పెట్టుకోవాలి. ఎప్పుడూ శంఖం నేల తాకరాదు. ఇది స్వచ్చతను చిహ్నం. శంఖం ఉపయోగించిన తర్వాత గిన్నెలో నీరు, గంగాజలం తీసుకుని అందులో వేయాలి. నీటిలో ముంచి తీసి తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిచి ఆరబెట్టి మళ్ళీ జాగ్రత్త చేసుకోవాలి.
కుబేరుడి ప్రతిమ
డబ్బు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడానికి లక్ష్మీ దేవి, కుబేరుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి. తల్లి లక్ష్మి మరియు కుబేరుడి అనుగ్రహం వల్ల జీవితంలో డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. లక్ష్మీదేవి, కుబేరుడు ఇద్దరూ సంపదను ప్రసాదించే దేవతలుగా కొలుస్తారు. వారి అనుగ్రహం పొందటం కోసం ఇంట్లో కుబేరుడు, లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకుని పూజ చేయడం మంచిది. అలాగే ఈశాన్య దిశను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఉత్తర దిశలో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. అందుకే ఈ దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల అదృష్టం లభించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. వీటితో పాటు ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోని మహిళలను గౌరవించాలి. అప్పుడే లక్ష్మీదేవి సంతోషిస్తుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్