Vastu Tips: వాస్తు ప్రకారం ఈ 5 వస్తువులను దిండు కింద పెట్టుకుని నిద్రపోతే సమస్యలన్నీ తీరుతాయి.. పీడకలలు కూడా రావు-keep these 5 things under pillow while sleeping these vastu tips are effective and provides positive energy as well ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: వాస్తు ప్రకారం ఈ 5 వస్తువులను దిండు కింద పెట్టుకుని నిద్రపోతే సమస్యలన్నీ తీరుతాయి.. పీడకలలు కూడా రావు

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ 5 వస్తువులను దిండు కింద పెట్టుకుని నిద్రపోతే సమస్యలన్నీ తీరుతాయి.. పీడకలలు కూడా రావు

Peddinti Sravya HT Telugu
Dec 30, 2024 12:00 PM IST

Vastu Tips: వాస్తు ప్రకారం, జీవితంలో సానుకూల శక్తి ప్రసరణను పెంచడానికి, చెడు, భయానక కలలకు దూరంగా ఉండడానికి కొన్ని వస్తువులను దిండు కింద ఉంచడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది జీవితంలో నెగిటివిటీని తొలగిస్తుందని నమ్ముతారు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ 5 వస్తువులను దిండు కింద పెట్టుకుని నిద్రపోతే సమస్యలన్నీ తీరుతాయి
Vastu Tips: వాస్తు ప్రకారం ఈ 5 వస్తువులను దిండు కింద పెట్టుకుని నిద్రపోతే సమస్యలన్నీ తీరుతాయి (pinterest)

వాస్తు శాస్త్రంలో లవంగాలు, నెమలి ఈకలు, పటిక వంటి కొన్ని వస్తువులను దిండు కింద ఉంచడం వల్ల సానుకూలత పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. వీటిని దిండు కింద ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. సంతోషం, అదృష్టం పెరుగుతాయి. వాస్తు ప్రకారం, వీటిని ప్రతిరోజూ మీ దిండు కింద ఉంచడం వల్ల జీవితంలో అనేక మార్పులు వస్తాయి. మీరు కోరుకున్న ఫలితాలను పొందవచ్చు. వీటిని దిండు కింద ఉంచుకోవడం శుభప్రదం.

yearly horoscope entry point

దిండు కింద వీటిని పెడితే కలిసి వస్తుంది:

నెమలీకలు:

నెమలీకలను హిందూమతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ప్రేమ, ఆనందాన్ని ఆకర్షించడానికి ఉపయోగిస్తారని నమ్ముతారు. దుష్ట శక్తులను వదిలించుకుని సంపదను ఆకర్షించాలంటే దిండు కింద నెమలి ఈకలను పెట్టి నిద్రించవచ్చు.

లవంగాలు:

మీరు రోజూ దిండు కింద 5,7 లేదా 9 లవంగాలను పెట్టి నిద్రపోవచ్చు. ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

బిర్యాని ఆకులు:

వాస్తు శాస్త్రంలో, బిర్యాని ఆకులను దిండు కింద ఉంచడం ఆనందం, శ్రేయస్సుకు కారకంగా పరిగణించబడుతుంది. దిండు కింద ఈ ఆకులను పెట్టి పడుకోవడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందని నమ్ముతారు.

పటిక:

వాస్తులో, దుష్ట శక్తులు మరియు భయానక కలల నుండి రక్షణ కోసం పటికను దిండు కింద ఉంచడం ప్రయోజనకరంగా భావిస్తారు. పటిక ముక్కను కనీసం 7 రోజులు దిండు కింద ఉంచడం వల్ల పీడకలలతో సహా ప్రతికూలత తొలగిపోతుందని నమ్ముతారు. ఆ తరవాత ఇంటి నుంచి తీసేయండి.

తులసి ఆకు:

హిందూమతంలో తులసి ఆకును పూజలో ఉపయోగిస్తారు. ఇవే కాకుండా తులసిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. నిద్రపోయేటప్పుడు తులసి ఆకును దిండు కింద ఉంచడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. అయితే సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకును తొలగించద్దు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం