వచ్చినట్టే డబ్బు వెళ్ళిపోతోందా? అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ 5 వస్తువులను ఇంట్లో పెట్టండి, సమస్యలు తీరిపోవచ్చు!-keep these 5 things at home for lakshmi devi blessings and money related problems will go away ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వచ్చినట్టే డబ్బు వెళ్ళిపోతోందా? అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ 5 వస్తువులను ఇంట్లో పెట్టండి, సమస్యలు తీరిపోవచ్చు!

వచ్చినట్టే డబ్బు వెళ్ళిపోతోందా? అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ 5 వస్తువులను ఇంట్లో పెట్టండి, సమస్యలు తీరిపోవచ్చు!

Peddinti Sravya HT Telugu

లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. దానితో పాటుగా లక్ష్మీదేవి ఉండాలంటే కొన్ని వాటిని ఇంట్లో ఉంచడం మంచిది. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే వీటిని కూడా ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఆర్థిక సమస్యలు కూడా రావు,

మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే వీటిని ఇంట్లో ఉండేలా చూసుకోండి (pinterest)

ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంతోషంగా ఉండడానికి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి కొన్ని పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే సంతోషంగా ఉండవచ్చు. ధనానికి కూడా లోటు ఉండదు. లక్ష్మీదేవి ధనం, ఐశ్వర్యం, సంతోషాన్ని అందిస్తుంది.

లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. దానితో పాటుగా లక్ష్మీదేవి ఉండాలంటే కొన్ని వాటిని ఇంట్లో ఉంచడం మంచిది. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే వీటిని కూడా ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఆర్థిక సమస్యలు కూడా రావు,

మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే వీటిని ఇంట్లో ఉండేలా చూసుకోండి

1.స్వస్తిక్, శ్రీ యంత్రం

స్వస్తిక్, శ్రీ యంత్రం రెండు కూడా శుభప్రదం. ఈ రెండు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై ఉంటాయి. సానుకూల శక్తిని అందించి, ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సంతోషాన్ని ఇస్తుంది. శ్రీ యంత్రం లక్ష్మీదేవికి చిహ్నం. ఇది ఆర్థిక ఇబ్బందుల్ని తొలగిస్తుంది. శ్రీ యంత్రాన్ని పెట్టి పూజ చేయడం వలన బాధలన్నీ తొలగిపోతాయి. సంతోషం, ధనం కలుగుతాయి.

2.కర్పూరం

కర్పూరాన్ని వెలిగించడం వలన సానుకూల శక్తి వ్యాపించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో కర్పూరం వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం, సంతోషం కూడా కలుగుతాయి.

3.రాగి లేదా కంచు సామాన్లు

ఇవి కూడా ఇంట్లో ఉండడం మంచిది. వీటి వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ రెండు లోహాలు కూడా లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. రాగి నాణేలు, రాగి సామాన్లు లేదా కంచు సామాన్లు వంటి వాటిని ఇంట్లో ఉంచడం వలన ప్రశాంతత కలుగుతుంది. ధనం ఉంటుంది.

4.గోమతి చక్రం

గోమతి చక్రాన్ని ఇంట్లో ఉంచడం వలన సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ధనానికి లోటు ఉండదు. ఇంట్లో పూజ గదిలో కానీ ముఖద్వారం దగ్గర కానీ వీటిని పెట్టవచ్చు. సక్సెస్ తో పాటుగా సంతోషం కూడా కలుగుతుంది. ఎటువంటి బాధలు ఉన్నా తొలగిపోతాయి.

5.కమల పూలు

కమల పూలను ఇంట్లో ఉంచడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ పూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వీటిని ఇంట్లో ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.