Vastu: మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఈ 5 పెయింటింగ్స్ ని ఇంట్లో ఉంచండి.. సమస్యలు తీరి, సంతోషంగా ఉండొచ్చు-keep these 5 paintings in home according to vastu and so you can change your life gets wealth positive energy will flow ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu: మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఈ 5 పెయింటింగ్స్ ని ఇంట్లో ఉంచండి.. సమస్యలు తీరి, సంతోషంగా ఉండొచ్చు

Vastu: మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఈ 5 పెయింటింగ్స్ ని ఇంట్లో ఉంచండి.. సమస్యలు తీరి, సంతోషంగా ఉండొచ్చు

Peddinti Sravya HT Telugu
Jan 18, 2025 10:30 AM IST

Vastu: వాస్తు ప్రకారం వీటిని ఇంట్లో ఉంచినట్లయితే సమస్యల నుంచి గట్టెక్కొచ్చు. ఈ 5 పెయింటింగ్స్ ని ఇంట్లో ఉంచినట్లయితే ఆనందంగా కూడా ఉండడానికి అవుతుంది.

Vastu: మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఈ 5 పెయింటింగ్స్ ని ఇంట్లో ఉంచండి
Vastu: మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఈ 5 పెయింటింగ్స్ ని ఇంట్లో ఉంచండి (pinterest)

వాస్తు ప్రకారం చాలా మంది ఇంట్లో మార్పులు చేసుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం మన ఇంట్లో మార్పులు చేయడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే వాస్తు ప్రకారం మన ఇంట్లో మార్పులు చేయడం వలన జీవితాన్ని కూడా మార్చేసుకోవచ్చు.

yearly horoscope entry point

వాస్తు ప్రకారం వీటిని ఇంట్లో ఉంచినట్లయితే సమస్యల నుంచి గట్టెక్కొచ్చు. ఈ 5 పెయింటింగ్స్ ని ఇంట్లో ఉంచినట్లయితే ఆనందంగా కూడా ఉండడానికి అవుతుంది.

వాస్తు ప్రకారం ఈ పెయింటింగ్స్ ని ఇంట్లో ఉంచితే జీవితమే మారిపోతుంది

1.నెమలి

నెమలి సానుకూల శక్తిని అందిస్తుంది. నెమలి పెయింటింగ్ ని ఇంట్లో ఉంచడం వలన ఇంట్లో అందం పెరగడంతో పాటుగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ధనం కలుగుతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. లివింగ్ రూమ్ లో నెమలి పెయింటింగ్ ఉంచండి. బంధాలు బలపడతాయి. సంతోషకరమైన వాతావరణం కలుగుతుంది.

2.ఏడు గుర్రాలు

ఇంట్లో ఏడు గుర్రాల పెయింటింగ్ పెట్టడం వలన కెరియర్ లో మార్పు వస్తుంది. కెరియర్ అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి అవుతుంది.

3.కమలం పువ్వు

కమలం పువ్వు పెయింటింగ్ ఇంట్లో ఉంచడం కూడా మంచి జరుగుతుంది. కమలం పువ్వు పెయింటింగ్ ని మెడిటేషన్ లేదా పూజ చేసుకునే చోట పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి కమలం పువ్వు పెయింటింగ్ ని కూడా ఇంట్లో పెట్టడం మంచిది.

4.పర్వతాలు

పర్వతాల పెయింటింగ్స్ ని ఇంట్లో పెట్టడం వలన కూడా ఎంతో మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దక్షిణం లేదా నైరుతి వైపు పర్వతాల ఫోటోలని పెట్టడం మంచిది. వృత్తిపరమైన జీవితంలో కూడా మార్పులు వస్తాయి. అలాగే ప్రశాంతంగా ఉండవచ్చు. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది.

5.వాటర్ ఫాల్స్

వాటర్ ఫాల్స్ పెయింటింగ్ పెట్టడం వలన సానుకూల శక్తిని పెంచుకోవచ్చు. ధనం ప్రవహిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఉత్తరం వైపు వాటర్ ఫాల్స్ పెయింటింగ్ ఇంట్లో పెట్టడం వలన మంచి జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం