ఇంటి గుమ్మం ముందు ఇలా ఉండకుండా చూసుకోండి- లేదంటే నెగటివ్ ఎనర్జీ ఎక్కువవుతుంది
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి, దోషాలను వదిలించుకోవడానికి కొన్ని ప్రత్యేక విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.
హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటి నిర్మాణ సమయంలో పడకగది, వంటగది, పూజ గది, బాత్రూమ్, మరుగుదొడ్డి మొదలైన అన్ని గదులను తయారు చేసేటప్పుడు వాస్తు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీనితో పాటు, ప్రధాన ద్వారం వద్ద కూడా వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం.
వాస్తు జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంతోషాన్ని తెస్తుందని నమ్ముతారు. ప్రధాన ద్వారానికి సంబంధించిన కొన్ని తప్పులు జీవితంలో అడ్డంకులు కలిగిస్తాయి. ప్రధాన ద్వారం వద్ద కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు.
ప్రధాన తలుపుకు సంబంధించిన వాస్తు చిట్కాలు
వాస్తు ప్రకారం లీకేజీ కారణంగా ప్రధాన ద్వారం ముందు ఎలాంటి నీరు ప్రవహించకూడదు. దీనివల్ల ఇంటి పిల్లలకు హాని కలుగుతుంది. ఇంట్లో ఎక్కడ కూడా నీరు కారడం ఉండకూడదు. అలా జరిగితే డబ్బు వృథా అవుతుంది.
ప్రధాన ద్వారం చుట్టూ అక్కడక్కడ మట్టి, ఇటుకలు, రాళ్లు ఉండకూడదు. ఇంటి ముందు ఎప్పుడూ చిందరవందరగా ఉండకూడదు. ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం ముందు చెత్త, వాచ్‌మెన్ క్యాబిన్, స్టోర్ రూమ్ ఉండకూడదు.
ప్రధాన ద్వారం ముందు ఆవు, మేక, గేదె, కుక్కను కట్టకూడదని చెబుతారు. ఇది పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. తలుపు తెరిచేటప్పుడు, మూసివేసేటప్పుడు ఎటువంటి శబ్దం ఉండకూడదు. ఇది అసహ్యకరమైన సంకేతంగా పరిగణిస్తారు. అందువల్ల శబ్దం వినబడినప్పుడు, తలుపుల మూలల్లో నూనె పోయాలి. తుప్పు పట్టినట్టుగా ఉండకూడదు. అలాగే తలుపులు పగుళ్లు లేకుండా చూసుకోవాలి.
ప్రధాన ద్వారం ముందు సెప్టిక్ ట్యాంక్, బోరింగ్, భూగర్భ నిల్వ ట్యాంక్ మొదలైనవి ఉండకూడదు. వాస్తు ప్రకారం ఇది ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ బయట తెరవకూడదు. ప్రధాన ద్వారం లోపలికి మాత్రమే తెరవాలి.
వాస్తు ప్రకారం రెండు ఇళ్లలోకి ప్రవేశించడానికి ఒక ప్రధాన ద్వారం ఉండకూడదు. వాస్తులో తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ప్రధాన ద్వారం ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రధాన ద్వారం త్రిభుజాకారం, వృత్తాకారం, చతురస్రం లేదా బహుభుజి ఆకారంలో ఉండకూడదు.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెప్పులు, బూట్లు ఉండే స్టాండ్ ఉంచకూడదు. వీటిని దక్షిణ లేదా పడమర దిశలో ఉంచుకోవాలి. లేదంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా స్తంభం ఉంటే దానికి అద్దం పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి దూరం అవుతుంది.
ప్రధాన ద్వారానికి ఎదురుగా వంట గది ఉంటే ప్రతికూల శక్తిని నివారించడం కోసం ఇంటి ముందు క్రిస్టల్ బాల వేలాడదీసుకోవచ్చు. అలాగే ఎప్పుడు గుమ్మం ముందు చీకటి ఉండకూడదు. వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్