కర్వా చౌత్ రాశి ఫలాలు 2025: వివాహిత మహిళలకు కర్వా చౌత్ ఉపవాసం చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది అక్టోబర్ 10 శుక్రవారం కర్వా చౌత్ పాటించనున్నారు. ప్రతి సంవత్సరం, ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం నాల్గవ రోజున, వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటూ ఉపవాసం పాటిస్తారు.
ఈ రోజున మహిళలు ఆహారం, నీరు తీసుకోకుండా సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం వుంటారు. సాయంత్రం గౌరీ మాతను పూజించి, చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తరువాత, ఉపవాసం విరమిస్తారు. అయితే ఉత్తరభారతదేశంలో కర్వా చౌత్ నాడే దక్షిణ భారతదేశంలో అట్లతద్దిని అదే రోజు జరుపుతారు.
ఈ సంవత్సరం, కర్వా చౌత్ పై గ్రహాలు, నక్షత్ర, రాశుల స్థానం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అందువల్ల ఈ కర్వా చౌత్ లేదా అట్లతద్ది చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. అక్టోబర్ 9న, కర్వా చౌత్ కు ఒక రోజు ముందు, సంపదకు చిహ్నం అయిన శుక్రుడు కన్యా రాశిలో సంచరించనున్నాడు.
కర్వా చౌత్ రోజున, అంటే అక్టోబర్ 10 నాడు, సూర్యుడు చిత్త నక్షత్రంలో సంచరిస్తాడు. అదే విదంగా చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. ఇలా ఆ రోజు గ్రహాల స్థానంలో మార్పు మూడు రాశులకు ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తుంది.
వృషభ రాశి వారికి కర్వా చౌత్ పండుగ శుభప్రదం కానుంది. ఉద్యోగంలో పురోభివృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త పని లేదా వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. భూమి, భవనం, వాహనం కొనుగోలుకు ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది.
కర్కాటక రాశి వారికి కర్వా చౌత్ రోజున ఏర్పడిన ప్రత్యేక యాదృచ్ఛికాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో, మీరు మంచి పెట్టుబడి అవకాశాలను పొందవచ్చు. మీరు పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారులు కొత్త భాగస్వామ్యాలు లేదా ఆర్థిక లాభాలను పొందవచ్చు. ఉద్యోగార్ధులకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది.
కర్వా చౌత్ పండుగ తులా రాశికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో, మీరు మీ ప్రసంగంతో ప్రజల హృదయాలను గెలుచుకోవచ్చు. ఉద్యోగం చేసే వారు సీనియర్ల నుండి ప్రశంసలు పొందవచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగ పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.