కార్తీక మాసంలో ఒక్కరోజైనా నదీ స్నానం చేయాలి, ఎందుకో తెలుసా?
కార్తీక మాసంలో కచ్చితంగా చేయాల్సిన పని నదీ స్నానం. దీన్నే కార్తీక స్నానం అని కూడా పిలుస్తారు. పుణ్య నదులలో నదీ స్నానం చేస్తే సకల దోషాలు పోతాయి. నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం చేయడం శరీరానికి ఎంతో శక్తి అందుతుంది.
ఏటా దీపావళి అమావాస్య ముగిసిన మరుసటి రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం శివునికి, విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. వారి అనుగ్రహం కోసం కార్తీక మాసంలో దీపారాధన చేయాలి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి తలంటు స్నానం చేసి దీపారాధన చేయాలి. కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం. అలాగే దీప దానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యాన్ని పొందొచ్చు.
ట్రెండింగ్ వార్తలు
శివారాధన, విష్ణు ఆరాధన చేయడం ద్వారా కార్తీక మాసంలో పాపాలు తొలగిపోతాయి. అలాగే ఈ మాసంలో కచ్చితంగా చేయాల్సిన పని నదీ స్నానం. దీన్నే కార్తీక స్నానం అని కూడా పిలుస్తారు. పుణ్య నదులలో నదీ స్నానం చేస్తే సకల దోషాలు పోతాయి. నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం చేయడం శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. అంతేకాదు కార్తీక మాసంలో నదుల్లో ఔషధ శక్తి ఉంటుంది.
నదీస్నానం చేయడం వల్ల మానసిక, శారీరక రోగాలను తొలగి పోతాయి. నదిలో నిల్చుని శివుడిని ప్రార్థిస్తూ మూడు సార్లు మునకలేయాలి. ఆధునిక కాలంలో ప్రతిరోజూ నదీ స్నానం చేయడం కుదరదు. కాబట్టి కనీసం ఒక్కరోజైనా నదిలో స్నానం చేయాలి. అలాగే ప్రతిరోజూ దీపారాధన చేయడం వీలు కాని వారు... కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే ఏడాదంతా దీపం పెట్టిన ఫలితం కలుగుతుంది.
అలాగే మహా విష్ణువు మత్య్స రూపంలో నీటిలోనే ఉంటారు. అందుకే కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తారు. ఇలా నదీ స్నానం చేయడం వల్ల మోక్షాన్ని పొందుతారు. నది స్నానం ఎప్పుడు పడితే అప్పుడ చేయకూడదు. సూర్యోదయానికి ముందే చేయాలి. శరీరానికి నూనె రాయకూడదు. నది స్నానం చేసి వచ్చాక తులసి మొక్కకు నీళ్లు పోయాలి. నెయ్యితో తులసమ్మ ముందు దీపం పెట్టాలి.
కార్తీక మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే నెయ్యి, అన్నం కలిపి వండి నైవేద్యాన్ని తయారుచేయాలి. లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తిని ఈ నైవేద్యాన్ని నివేదించి, దీపం పెట్టి మొక్కాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్ధిక సమస్యలన్నీ తొలగి, సిరి సంపదలు కలుగుతాయి.