Kartik Deepam : పొరపాటున కూడా దీపం ఇలా వెలిగించొద్దు.. అశుభం
Kartik Purnima 2023 : కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక దీపం వెలిగించేప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు. అలా చేస్తే మీ అశుభం అని పండితులు అంటున్నారు. ఎలాంటి తప్పులు చేయెుద్దో తెలుసుకుందాం..
దీపం పెట్టేందుకు సరైన నియమం ఉంది. ఈ నియమం అందరికీ తెలియదు కాబట్టి దీపం వెలిగించేటపుడు తరచూ పొరపాట్లు చేస్తుంటారు. ఈ తప్పు వల్ల దీపం వెలిగించినా పూర్తి ప్రయోజనం పొందలేరు. హిందూ ధర్మంలో దీపం వెలిగించడం చాలా ప్రత్యేకం. ప్రతీ పండగకు దీపాలు ఉంటాయి. అందులో కార్తీక మాసం అంటే చాలా పవిత్రత ఉంటుంది.
ఇప్పుడు కార్తీకమాసం నడుస్తోంది. ఈ మాసంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యమైనదని చెబుతారు. అలాగే కార్తీక దీపం నాడు మన ఇళ్లలో చాలా ప్రదేశాలను దీపాలతో అలంకరిస్తారు. ఈ రోజున దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని విశ్వాసం. కార్తీక మాసంలో ఇంటిని దీపాలతో అలంకరించుకోవడం తప్పు కాదు. కానీ దీపం సరిగా పెట్టడం చాలా ముఖ్యం. సరైన నియమాలు, పద్ధతుల ప్రకారం మీరు దీపం వెలిగించకపోతే, మీరు అనేక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీపం పెట్టేందుకు సరైన నియమం గురించి ఇక్కడ తెలుసుకోండి.
స్వచ్ఛమైన దీపం.. అంటే గతంలో కాల్చిన వత్తి లేదా నూనె లేకుండా శుభ్రమైన దీపం. పాత కాలిన దీపాన్ని పూర్తిగా నీటితో శుభ్రం చేసి దీపాన్ని వెలిగించాలి. పాత దీపాన్ని వెలిగించకూడదని గుర్తుంచుకోండి.
దీపాన్ని వెలిగించడానికి ఇత్తడి, రాగి, మట్టితో చేసిన దీపాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఇది ఉత్తమమైనది, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల, ఇతర లోహాలతో చేసిన దీపాలను ఉపయోగించవద్దు. ప్రయోజనం ఉండదు.
ఇత్తడి దీపంలో దీపం వెలిగించేటప్పుడు వత్తి, నెయ్యి, నూనె, పసుపు బియ్యం, పూల రేకులు వేసి దీపం వెలిగించాలి.
అలాగే దీపం వెలిగించడానికి నెయ్యి, ఆవనూనె, నువ్వుల నూనె వాడండి.. చాలా మంది తమకు తెలియకుండానే అన్ని దేవతల ముందు రకరకాల దీపాలు వెలిగిస్తారు. కొన్ని నూనె దీపాలు కొన్ని ప్రత్యేక రోజులు, తేదీలు, దేవతలకు మాత్రమే అంకితం చేయబడతాయి. తెలియకుండా దీపం వెలిగించడానికి ఉపయోగించవద్దు. ఈ కార్తీకమాసం చాలా పవిత్రమైనది. దీపాలు వెలిగించే ముందు పైన చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి. మీకు అంతా శుభమే కలుగుతుంది.