చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా విశ్వావసు నామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితములు..
గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14.5.25 వరకు వృషభంలో ఉంటాడు. అన్నికార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది.
15.5.25 నుంచి 19.10.25 నుంచి, 6.12.25 నుండి సంవత్సరం చివరి వరకు మిథునంలో ఉంటాడు. ఋణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
20.10.25 నుంచి 5.12.25 నుంచి కర్కాటకంలో ఉంటాడు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుట మంచిది.
శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు మీనంలో ఉంటాయి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోస పోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు కన్య రాశిలో ఉంటాడు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడుట మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.
19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. కుటుంబపరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఆకస్మిక ధన లాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. శుభకార్యములు చేయుదురు. భార్యా పిల్లలతో కలసి వినోదయాత్రలకు వెళ్ళెదరు. సంతానం గూర్చి ఆలోచనలుంటాయి. మానసికానందం ఉంటుంది. రుణాలు చేయుదురు.
ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఇబ్బందులుంటాయి. కొత్తవారితో పరిచయాలేర్పడతాయి. బంధువులతో, స్నేహితులతో ఆనందముగా గడుపుతారు. సంఘంలో గౌరవం ఏర్పడును.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధములు ఏర్పడు సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు ఆటంకము ఏర్పడును. మృష్టాన్న భోజనం చేస్తారు. విపరీతమైన ఆలోచనలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. అధికముగా శ్రమించెదరు.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. స్నేహితుల వలన ధనము ఖర్చు చేస్తారు. కోర్టు వ్యవహారములు అనుకూలిస్తాయి. ప్రయత్నించిన కార్యములు ఫలించును. ధన లాభం ఉంటుంది. బంధుమిత్రులతో అభిప్రాయ బేధములు ఏర్పడును. అనారోగ్య సమస్యలుంటాయి.
ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. బంధువులతో విరోధాలుంటాయి. వ్యాపారస్తులకు లాభదాయకము. దేవాలయ సందర్శన చేస్తారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. కొంతకాలంగా ఆగిన పనులు పూర్తవుతాయి. మాట పట్టింపులుంటాయి. డిపాజిట్లు, చీటీలు కలసివచ్చును. ఎత్తు నుండి జారిపడెదరు.
ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. కొత్త వస్త్రములు కొంటారు. ఆకస్మిక ధనలాభముండును. స్త్రీల వలన కష్టములుంటాయి. ధనమునకు ఇబ్బంది కలుగును. మీ కారణంగా ఇతరులు బాధ పడతారు. గౌరవ మర్యాదలు పెరుగును. జాయింట్ వ్యాపారాలలో సఖ్యత ఉండును. నరముల బలహీనత, నిద్రలేమి ఇబ్బంది వలన ఇబ్బంది పడతారు.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వ్యాపార నష్టాలూ ఉంటాయి. అనవసర ఖర్చులుంటాయి. కుటుంబములో గొడవలు. ప్రత్యర్థుల విజయం. పదవులు కోసం ప్రయత్నములు చేస్తారు. తలచిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మిత్రులతో అపార్ధములు.
ఈ మాసంలో మీకు అనుకూలంగా లేదు. నమ్మినవారు మోసం చేయుదురు. నూతన పరిశ్రమలు ప్రారంభం. కొత్త వ్యక్తుల ద్వారా ధన లాభముంటుంది. అనారోగ్యం సమస్యలుంటాయి. మధ్య వర్తిత్వము వ్యవహరించుట మంచిది కాదు. కోర్టు తగాదాలకు అనుకూలం కాదు. ప్రమాద సూచనలున్నాయి. జాగ్రత్త అవసరం.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. భూమి, గృహాభివృద్ధి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా లాభదాయకం. శుభకార్యాలకు మంచిది. గౌరవానికి కొంత భంగం కలుగుతుంది. వృధా ప్రయాణాలుంటాయి. మీ మాట తీరు వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. మీరు చేసే పనులు ఆలస్యమగును.
ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. గతంలో నిలిచిన పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలుంటాయి. శుభకార్యములకు ఆటంకాలు. స్త్రీ పరిచయములు. అధికారులతో విరోధాలు. పని భారము పెరుగును. అదనపు రాబడి ఉండును.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపార ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. మంచి లాభములుంటాయి. వంశ వృద్ధియగును. స్త్రీపరంగా సహాయము లేర్పడును. వాహన సౌఖ్యం. కొద్దిపాటి అపజయం. వ్యవసాయరంగములో లాభములు.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ధన వ్యయముండును. నూతన పరిచయములు. శుభకార్యములు చేస్తారు. గృహములో మార్పులుంటాయి. ఇంట బయటా విరోధములుంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి.
సంబంధిత కథనం