karkataka Rasi Today : కర్కాటక రాశి వారికి ఈరోజు ఇగోతో కొత్త చిక్కులు, ఆఫీస్‌లో జాగ్రత్త-karkataka rasi daily horoscope august 20 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karkataka Rasi Today : కర్కాటక రాశి వారికి ఈరోజు ఇగోతో కొత్త చిక్కులు, ఆఫీస్‌లో జాగ్రత్త

karkataka Rasi Today : కర్కాటక రాశి వారికి ఈరోజు ఇగోతో కొత్త చిక్కులు, ఆఫీస్‌లో జాగ్రత్త

Galeti Rajendra HT Telugu
Aug 20, 2024 04:50 AM IST

Cancer Horoscope Today: పుట్టిన సమయంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్న జాతకుల రాశిని కర్కాటక రాశిగా పరిగణిస్తారు. ఈరోజు కర్కాటక రాశి వారి కెరీర్, ఆరోగ్యం, ఆర్థిక, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోవచ్చు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి

Cancer Horoscope 20 August 2024: కర్కాటక రాశి వారు ఈరోజు అన్ని విషయాలను చాకచక్యంగా హ్యాండిల్ చేయాలి. మీ భాగస్వామితో భావోద్వేగాలను పంచుకోండి. ఆఫీస్‌లో కొత్త బాధ్యతలు మీ నిబద్ధతను మరింతగా కోరుతాయి.

డబ్బు వస్తుంది. కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు ఆఫీసులో సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి, అయితే ఎక్కువ ఫలితాలను పొందడానికి ప్రయత్నించండి. ఈరోజు డబ్బును జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మీ ఆరోగ్యం కూడా సానుకూలంగా ఉంటుంది.

ప్రేమ

కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రేమ బంధంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కారణం అహంకారం ఒకటి అయితే, మునుపటి ప్రేమ వ్యవహారం కూడా మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమస్యను కాస్త హుందాగా పరిష్కరించండి. మీ భావోద్వేగాలను పంచుకోవడానికి మీరిద్దరూ కలిసి కూర్చోవాలి.

భాగస్వామితో ఈ రోజు మీ అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే దాన్ని భిన్నంగా వాళ్లు తీసుకోవచ్చు. ఈ రోజు కొన్ని బంధాలు సంతోషకరమైన ముగింపును ఇవ్వవు. వివాహిత స్త్రీలు బంధంలో మూడవ వ్యక్తి జోక్యాన్ని దూరంగా ఉంచాలి.

కెరీర్:

ఈ రోజు మీ పని అంచనాలను తగినట్లుగా ఉండదు. ఇది సీనియర్లకి కోపం తెప్పిస్తుంది. కాబట్టి ఈ రోజు సహనం కోల్పోకుండా ఆఫీస్‌లో ఒత్తిడిని ఎదుర్కోండి. టీమ్ మీటింగ్ సమయంలో, మీ ఇగోను పక్కన పెట్టండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌తో క్లయింట్‌ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించండి.

ఆర్థికం

కర్కాటక రాశి వారు ఈరోజు ధనలాభం పొందుతారు, కానీ ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. ఈ రోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి, ఎందుకంటే ఇది మంచి రాబడిని ఇవ్వదు. ఆఫీస్‌లో ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలతో జాగ్రత్తగా మాట్లాడండి. మీ కింద పనిచేసే కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మిమ్మల్ని భావోద్వేగపరంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించవచ్చు.

ఆరోగ్యం

ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు సులభంగా శ్వాస తీసుకోగలుగుతారు. అయితే, ఆరోగ్యపరంగా అత్యవసరం అనిపించినప్పుడు వైద్యుడిని సంప్రదించండి.