విశ్వావసు నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా
గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14.5.25 వరకు వృషభంలో ఉంటాడు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధన లాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి.
గురుడు 15.5.25 నుండి 19.10.25 వరకు, తిరిగి 6.12.25 నుండి సంవత్సరం చివరి వరకు మిథునంలో ఉంటాడు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు.
20.10.25 నుండి 5.12.25 వరకు కర్కాటకంలో ఉంటాడు. అన్నికార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు, శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధన లాభం ఉంటుంది.
శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనో విచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు మీనంలో ఉంటాడు. ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
19.5.25 నుండి సంవత్సరం వరకు కుంభంలో ఉంటాడు. మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృ బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు కన్యలో ఉంటాడు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా వుంటే మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.
19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
బృహస్పతి మే నుండి పదో స్థానమునందు సంచరించటం, శని 7వ స్థానమునందు సంచరించుట చేత, రాహువు మే నుండి ఆరవ స్థానము నందు, కేతువు మే నుండి పన్నెండవ స్థానము నందు సంచరించుట చేత కన్యారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితములు తెచ్చే సంవత్సరంగా చూడవచ్చును.
కన్యా రాశి వారు శత్రువులపై విజయాన్ని పొందెదరు. కొంత కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ ఉన్నతికి కొనియాడెదరు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి మార్పు తెచ్చి శుభఫలితాలను అందించే సంవత్సరం. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం ఆనందము కలుగును. ఉద్యోగస్తులకు శుభఫలితములు కలుగును.
కన్యా రాశివారు మరింత శుభఫలితాలు ఈ సంవత్సరం పొందటం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. మరియు కనకధారా స్తోత్రాన్ని పఠించండి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనాల వలన శుభ ఫలితాలు కలుగును.
ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. చెడు స్నేహములు చేయకండి. ధన నష్టము ఉండొచ్చు. సమయానికి భోజనం లేకపోవచ్చు. ఇంటియందు సౌఖ్యము. ప్రతీ పనిలో వ్యతిరేకంగా ఉంటుంది.
ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. భార్య పిల్లలతో కలసి తీర్థయాత్రలు చేస్తారు. మంచి అవకాశములు లభించును. ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వృత్తిపరమైన మార్పులు ఉంటాయి.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. వ్యర్థ ప్రయాణములుంటాయి. ప్రయాణములు ప్రమాదములు సంభవించును. దైవ కార్యములలో పాల్గొనెదరు. అపవాదులు వచ్చును. గృహ నిర్మాణాలు, శుభకార్యాలుంటాయి.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విందులలో పాల్గొనెదరు. మాట పట్టింపులు. అశుభమైన వార్తలు వింటారు. ధన లాభం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. గౌరవం పెరుగును. విరోధములుంటాయి. ప్రారంభములో ఆటంకాలుంటాయి.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కార్యహాని. కోర్టు వ్యవహారములు అనుకూలించవు. అధిక ఒత్తిడి. వ్యాపార, ఉద్యోగపరంగా అనుకూలం. ధనలాభముంది. ఆర్థిక లావాదేవీలు కలసివచ్చును. ఇతరులు మిమ్ములను మోసం చేయుదురు.
ఈ మాసం మీకు అనుకూల ఫలితాలున్నాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవసాయ మూలకంగా ధనలాభం. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని విషయాలలో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో కలసి ప్రయాణించెదరు. మానసిక అశాంతి.
ఈ మాసంలో మీకు అనుకూలంగా లేదు. ఇతరులతో వివాదాలేర్పడును. ప్రేమ విషయాలు అనుకూలించును. శుభకార్యములు చేయుదురు. దూర ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. కార్యాటంకాలు, విరోధములు, మనస్సున ఆందోళన.
ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. స్త్రీపరంగా ధన వ్యయము. శత్రువు వలన భయము, అవమానాలు. ఉద్యోగ, వ్యాపారపరంగా లాభదాయకం. దూర ప్రయాణాలు చేయుదురు. ఆరోగ్యం అనుకూలించును. విలువైన వస్తువులు జాగ్రత్త.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. చెడు వార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలుంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. విందులు, వినోదాలకు ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. స్త్రీ విరోధాలు వచ్చును. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యవసాయాభివృద్ధి. బంధువులకు ఆరోగ్య సమస్యలు.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబములో కోపతాపములు పెరుగును. పెద్దవారితో అనుకూలం. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత. స్థిరాస్తి వృద్ధి.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారములు అనుకూలించును. గృహోపకరణ వస్తువులు కొంటారు. స్థిరాస్తి, వాహనాలు కొంటారు. ఉద్యోగావకాశములు. ఆప్తులను కలుసుకుంటారు. ఆచితూచి సంభాషించాలి. స్నేహితుల సహకారం ఉంటుంది.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపార, ఉద్యోగపరంగా కలసి వస్తుంది. పిల్లలతో ప్రయాణములు, విలాసాలు, ముఖ్య వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయ పరంగా కలసివచ్చును. ఇతర పనులు వల్ల స్వల్ప ఇబ్బందులుంటాయి.
సంబంధిత కథనం