Kanuma: కనుమ పండుగ విశిష్టత, ఎలా జరుపుకోవాలి? ఎందుకు ఈరోజు ప్రయాణాలు చేయకూడదు?
Kanuma: కనుమ పండుగ నాడు కూడా అందరూ కలిసి కనులు విందుగా పండుగను జరుపుకుంటారు. కనుమ పండుగ సందర్భంగా పశువులని అందంగా అలంకరిస్తారు. పూజలు కూడా చేస్తారు.
సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా జరుపుతారు. సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటారు. ఆంగ్ల నూతన సంవత్సరంలో తొలి పండుగ మకర సంక్రాంతి పండుగ. ఈ పండుగను కుటుంబ సభ్యులందరూ కలిసి సరదాగా జరుపుకుంటారు. భోగి మంటలతో ఈ పండుగ ప్రారంభమవుతుంది.

కనులవిందుగా జరిపే కనుమ పండుగ
- కనుమ పండుగ నాడు కూడా అందరూ కలిసి కనులు విందుగా పండుగను జరుపుకుంటారు. కనుమ పండుగ సందర్భంగా పశువులని అందంగా అలంకరిస్తారు. పూజలు కూడా చేస్తారు.
2. సాయంత్రం పూట ఊరేగింపులు చేస్తారు. కనుమ పండుగ కనుమ పండుగ నాడు పశువులని ఊరేగింపు చేయడమే కాదు. వాటిని అందంగా అలంకరించి పూజలు చేస్తారు.
3. ఈ రోజు పశువులకు ఇష్టమైన ఆహారాన్ని కూడా పెడతారు.
4. కనుమ నాడు మినుముని తప్పక తినాలని అంటారు.
5. కనుమ నాడు ఎవరూ కూడా ప్రయాణాలు చేయకూడదని అంటారు.
కనుమ నాడు మాంసాహారం, మినుము
కనుమ నాడు పూర్వికులు తలుచుకుని మాంసాహారాన్ని తింటారు. సంక్రాంతి, భోగి నాడు పిండి వంటలు చేస్తారు. కనుమనాడు పోషకాహారమైనటువంటి మినుముల్ని తినాలని పెద్దలు చెప్తూ ఉంటారు. వీటిని తింటే శరీరానికి తగిన వేడి అందుతుంది.
చలి నుంచి తట్టుకునే శక్తి వస్తుంది అలాగే కనుమ నాడు పశువుల్ని పూజిస్తారు. మధ్యాహ్నం పూర్వికులకు తర్పణాలు ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో కనుమ నాడు మేక, కోడి, గొర్రె, పొట్టేళ్లను బలి ఇవ్వడం కూడా జరుగుతుంది.
కనుమ నాడు ఎందుకు ప్రయాణాలు చేయకూడదు?
కనుమ నాడు ప్రయాణం చేస్తే ఏమైనా కీడు జరిగే అవకాశం ఉంటుందని అంటారు. అందుకని మూడు రోజులు పాటు పండగను జరుపుకొని తర్వాత ప్రయాణం చేయాలని అంటారు. కొంతమంది మాత్రం దీనిని కొట్టిపారేస్తారు.
నాలుగవ రోజు
ముక్కనుమ పండుగని నాలుగవ రోజు జరుపుతారు. ఉత్తరాంధ్రలో నాటుకోడి పులుసు, నాటుకోడి ఇగురు వంటివి వండుకుంటారు. మాంసాహారాన్ని తింటారు, అదే తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అయితే ఈరోజు కూరగాయలు, పప్పు, చింతపండు, బెల్లం వంటివి కలిపి వంటకాలను తయారుచేస్తారు.
కనుమ పండుగ విశిష్టత
రైతులు వారి పశువుల్ని ఇంటి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు. పశువులు సంవత్సరం అంతా ఎంతో సహాయం చేస్తాయి. అందుకని కృతజ్ఞత చెప్పుకునే పండుగగా ఈ కనుమ పండుగని జరుపుతారు.
కనుమ పండుగ అంతరార్థం ఇదే. పండుగ సందర్భంగా కాటమరాయుడుని పూజిస్తారు. ప్రతి గ్రామంలో కూడా ఇలా జరుపుతారు. ఊరి పొలిమేర్లలో ఉండే కాటమరాయుడు గ్రామంలో పశువుల్ని కాపాడతాడని గ్రామస్తులు, రైతుల నమ్మకం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం