Kanuma: కనుమ పండుగను పశువుల పండుగ అని ఎందుకు అంటారు? ఆరోజు ఏం దానం చేయాలి, ఏ రంగు దుస్తులు వేసుకోవాలి?-kanuma festival 2025 what to do on that day and check what to donate on that day and which color clothes to wear ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kanuma: కనుమ పండుగను పశువుల పండుగ అని ఎందుకు అంటారు? ఆరోజు ఏం దానం చేయాలి, ఏ రంగు దుస్తులు వేసుకోవాలి?

Kanuma: కనుమ పండుగను పశువుల పండుగ అని ఎందుకు అంటారు? ఆరోజు ఏం దానం చేయాలి, ఏ రంగు దుస్తులు వేసుకోవాలి?

Peddinti Sravya HT Telugu
Jan 14, 2025 01:30 PM IST

Kanuma: కనుమ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. కనుమ పండుగ విశిష్టతతో పాటుగా.. ఆ రోజు ఏ రంగు దుస్తులు వేసుకుంటే బాగుంటుంది, వేటిని దానం చేస్తే పుణ్యం దక్కుతుంది అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

Kanuma: కనుమ పండుగను పశువుల పండుగ అని ఎందుకు అంటారు?
Kanuma: కనుమ పండుగను పశువుల పండుగ అని ఎందుకు అంటారు? (freepik)

సంక్రాంతి తర్వాత వచ్చే పండుగను కనుమ పండుగ అంటారు. కనుమ పండుగ నాడు పశువులని అలంకరించి అందంగా జరుపుతారు. పట్టణాల్లో కూడా ఈ పండుగను బాగానే జరుపుతారు. ఈ పండుగను పశువుల పండుగ అని పిలుస్తారు. ఈరోజు రైతులు అన్నం పెట్టే భూమికి, ఆవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు.

సంబంధిత ఫోటోలు

సంక్రాంతి తరవాత జరుపుకునే కనుమ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. కనుమ పండుగ విశిష్టతతో పాటుగా.. ఆ రోజు ఏ రంగు దుస్తులు వేసుకుంటే బాగుంటుంది, వేటిని దానం చేస్తే పుణ్యం దక్కుతుంది అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

పశువులకు అలంకరణ

  1. కనుమ నాడు పశువులని అందంగా అలంకరిస్తారు. ఆవులు, గేదెలు, ఎద్దులు వంటి పశువులకు పసుపు, కుంకుమ, పూలు పెట్టి అందంగా అలంకరిస్తారు. కొంతమంది అయితే బెలూన్స్ కూడా కడతారు. కాళ్లకు గజ్జలు కడతారు. మెడలో గంటలు వేస్తారు. ఇలా అందంగా పశువులను అలంకరించి వాటికి పూజ చేస్తారు. ప్రేమగా వాటిని చూసుకుంటారు.

2. అలాగే పశువులు ఉండే పాకను కూడా అందంగా అలంకరిస్తారు.

3. పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. దీనిని నైవేద్యంగా పెడతారు. తర్వాత పొలానికి తీసుకువెళ్లి చల్లుతారు. దీనినే పోలి చల్లడం అని అంటారు. సంవత్సరం పాటు పంటలకు చీడపురుగులు పట్టకుండా కాపాడమని దేవతలని ఆరాధిస్తారు.

కనుమ నాడు ఏ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది?

కనుమ నాడు ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటే మంచిది. ఈ రంగు దుస్తులు వేసుకోవడం వలన సుఖశాంతులు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కనుమనాడు మాంసాహారాన్ని వండుతారు. అలాగే ఈ రోజు ఎవరినీ కూడా ప్రయాణం చేయకూడదని అంటారు. ఇంటికి వచ్చిన బంధువులతో సంతోషంగా సరదాగా పండుగని జరుపుకుంటారు.

కనుమ నాడు ఏం దానం చేయాలి?

కనుమ నాడు దానం చేస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా కనుమనాడు పెరుగుని దానం చేయడం మంచిది. కొన్ని ప్రాంతాల్లో కనుమ పండుగ నాడు ఎద్దుల బండి పోటీలను, కోడి పందేలు నిర్వహిస్తారు. వీటిని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు.

పశువుల పండగ అని ఎందుకు అంటారు?

కనుమ నాడు పశువులను అందంగా అలంకరిస్తారు. వాటికి పూజలు కూడా చేస్తారు. ఇలా కనుమ పండుగ పశువులతో ముడిపడి ఉంది. అందుకని పశువుల పండుగ అని అంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner