Kamika ekadashi 2024: ఏడాదికి 24 ఏకాదశులు ఉంటాయి. నెలలో ఒకటి కృష్ణ పక్షంలో, మరొకటి శుక్ల పక్షంలో ఏకాదశి వస్తుంది. ప్రతి ఏకాదశికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. ఆషాడ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి శ్రీ మహా విష్ణవును పూజిస్తారు. క్రమం ప్రకారం విష్ణు మూర్తికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. ఏకాదశి ఉపవాసం ఆచరించిన వ్యక్తి అన్ని దోషాల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు.
ఈ సంవత్సరం కామికా ఏకాదశి వ్రతం జూలై 31న జరుపుకుంటారు. ఈ ఏకాదశి వ్రత విశిష్టతను తెలియజేసే వ్రత కథను తప్పనిసరిగా చదవాలని చెప్తారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో కేదార్, పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యం కామికా ఏకాదశి నాడు శివుడిని ఆరాధించడం వల్ల కూడా శ్రవణం చెందుతుందని చెబుతారు. అందుకే కామికా ఏకాదశి కథ చదవకుండ ఈ వ్రతం పూర్తి కాదని చెబుతారు.
పూర్వం ఒక గ్రామంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు. అతను తన శక్తి, బలాన్ని చూసి చాలా గర్వపడ్డాడు. క్షత్రియుడు భగవంతుడిని చాలా నమ్మాడు. కానీ అతని మనస్సులో గర్వం ఉంది. అతను ప్రతిరోజూ శ్రీమహావిష్ణువును ఆరాధించాడు. అతని ఆరాధనలో నిమగ్నమై ఉన్నాడు. ఒక రోజు, అతను ఏదో ముఖ్యమైన పని మీద ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక బ్రాహ్మణుడు కలిశాడు. ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుని తోపులాటకు దారితీసింది. క్షత్రియుడు చాలా బలవంతుడు, బ్రాహ్మణుడు బలహీనత కారణంగా క్షత్రియుని దాడిని తట్టుకోలేక అక్కడే పడి చనిపోయాడు.
బ్రాహ్మణుని మరణంతో క్షత్రియుడు చలించిపోయాడు. అతను తన తప్పును గ్రహించి తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు. ఈ విషయం గ్రామంలో దావానంలా వ్యాపించింది. క్షత్రియ యువకుడు గ్రామస్తులకు క్షమాపణలు చెప్పి బ్రాహ్మణుని అంత్యక్రియలు స్వయంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చాడు. అయితే పండితులు అంత్యక్రియలకు హాజరుకావడానికి నిరాకరించారు. అప్పుడు అతను జ్ఞాన పండితుల నుండి అతని పాపం గురించి తెలుసుకోవాలనుకున్నాడు.
అతను బ్రాహ్మణ హత్య చేశాడని అందువల చివరి కర్మల బ్రాహ్మణ విందులో మేము మీ ఇంట్లో భోజనం చేయలేమని చెప్పారు. ఇది విన్న క్షత్రియుడు బ్రహ్మణుడిని చంపిన నేరానికి ప్రాయశ్చిత్తం కోసం పరిష్కారం అడిగాడు?
అప్పుడు పండితులు ఆషాడ మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశి తిథి నాడు శ్రీమహావిష్ణువును పూజించాలి. బ్రాహ్మణులకు అన్నదానం చేసి, దానధర్మాలు చేయకపోతే, బ్రాహ్మణుడిని చంపిన నేరం నుండి విముక్తి పొందలేడని వివరించారు. బ్రాహ్మణుని అంత్యక్రియల తరువాత క్షత్రియుడు పండితుల సలహాను అనుసరించి కామికా ఏకాదశి రోజున విష్ణువును పూర్తి భక్తితో, పద్ధతితో పూజించాడు. ఆపై అతను బ్రాహ్మణులకు భోజనం పెట్టాడు. దానదక్షిణ కూడా ఇచ్చాడు. ఈ విధంగా విష్ణువు అనుగ్రహంతో ఆ క్షత్రియుడు 'బ్రాహ్మణ హత్యా దోషం' నుండి విముక్తి పొందాడు.