Kamada Ekadashi Puja: రేపే కామద ఏకాదశి, ఈరోజు విష్ణువుని ఇలా ఆరాధిస్తే కష్టాలు తీరుతాయి.. ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు?-kamada ekadashi puja vidhanam and does and donts are here do these tomorrow for lord vishnu blessings and wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kamada Ekadashi Puja: రేపే కామద ఏకాదశి, ఈరోజు విష్ణువుని ఇలా ఆరాధిస్తే కష్టాలు తీరుతాయి.. ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు?

Kamada Ekadashi Puja: రేపే కామద ఏకాదశి, ఈరోజు విష్ణువుని ఇలా ఆరాధిస్తే కష్టాలు తీరుతాయి.. ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు?

Peddinti Sravya HT Telugu

Kamada Ekadashi Puja: ఏప్రిల్ 8న కామద ఏకాదశిని జరుపుకోవాలి. ఈరోజు ఉపవాసం చేయడం, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన ప్రత్యేక ఫలితం ఉంటుంది. ఈరోజు ఏం చేయాలి, పూజా విధానం గురించి, చేయాల్సిన పరిహారాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

రేపే కామద ఏకాదశి

చైత్రమాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు కామధ ఏకాదశి జరుపుకుంటాము. ఈసారి ఏప్రిల్ 7 రాత్రి ఎనిమిది గంటలకు ఇది మొదలవుతుంది. శుక్లపక్ష ఏకాదశి తిధి ఏప్రిల్ 8న రాత్రి 9:12 తో ముగుస్తుంది. ఏకాదశి తిధి సూర్యోదయం నుంచి లెక్కించబడుతుంది. కాబట్టి ఏప్రిల్ 8న కామద ఏకాదశిని జరుపుకోవాలి. ఈరోజు ఉపవాసం చేయడం, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన ప్రత్యేక ఫలితం ఉంటుంది.

కామద ఏకాదశి

కామద ఏకాదశిని దమన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఏం చేయాలి, ఈరోజు పూజ నియమాల గురించి, పూజా విధానం గురించి, చేయాల్సిన పరిహారాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

కామద ఏకాదశి నాడు ఎలా పూజ చేయాలి?

  1. కామద ఏకాదశి నాడు వివాహితులు లక్ష్మీనారాయణను ఆరాధించాలని పండితులు చెప్తున్నారు.
  2. ఈ రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి.
  3. ఉపవాసం ఉంటానని సంకల్పం చెప్పుకోవాలి.
  4. ఆ తర్వాత శ్రీహరి చిత్రపటాన్ని శుభ్రం చేసుకుని, పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై పెట్టాలి.
  5. అక్షతలు, గంధం, పువ్వులు సమర్పించాలి.
  6. స్వామివారికి పంచామృతాలు, అరటి పండ్లు, తులసి దళాలు సమర్పించాలి.
  7. ధూప దీప నైవేద్యాలతో ఇలా స్వామివారిని ఆరాధించాలి.
  8. విష్ణు చాలీసా, కామద ఏకాదశి వ్రత కథను చదువుకోవాలి.
  9. చివరిగా హారతితో పూజ ముగించాలి.'
  10. ఈరోజు సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయాలి. నెయ్యతో దీపం వెలిగిస్తే మరీ మంచిది.

ఈరోజు పాటించాల్సిన నియమాలు

రాత్రి నిద్ర పోకుండా ఈరోజు జాగారం ఉంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. విష్ణువుకి కీర్తనలు, భజనలు పడితే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. శక్తి కొద్ది దానధర్మాలు కూడా చేయవచ్చు.

ఈరోజు ఏం చేయకూడదు?

  1. జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లను కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు
  2. ఉపవాసం ఉన్నట్లయితే మధ్యాహ్నం నిద్ర పోకూడదు
  3. మాంసం, మద్యానికి ఈరోజు దూరంగా ఉండాలి
  4. ఎవరినీ దూషించకూడదు

ఇలా ఈ విధంగా ఏకాదశి నాడు పూజ చేయడం వలన దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి

ఏకాదశి తిధిని లోక రక్షకుడు శ్రీహరికి అంకితం చేసారు. కాబట్టి ఈరోజు ఈ విధంగా ఈరోజు విష్ణువుని ఆరాధిస్తే పుణ్యఫలం ఉంటుంది. ఈ తప్పులు మాత్రం చేయకుండా చూసుకోండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం