Kamada ekadashi: కామద ఏకాదశి రోజు ఈ పరిహారాలు పాటించారంటే మీ సంపద రెట్టింపు అవుతుంది-kamada ekadashi date and time follow these remedies on this day for bright future ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kamada Ekadashi: కామద ఏకాదశి రోజు ఈ పరిహారాలు పాటించారంటే మీ సంపద రెట్టింపు అవుతుంది

Kamada ekadashi: కామద ఏకాదశి రోజు ఈ పరిహారాలు పాటించారంటే మీ సంపద రెట్టింపు అవుతుంది

Gunti Soundarya HT Telugu
Published Apr 18, 2024 10:31 AM IST

Kamada ekadashi: ఏప్రిల్ నెల చైత్ర మాసంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. ఏప్రిల్ 19వ తేదీన కామద ఏకాదశి వచ్చింది. ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది.

కామద ఏకాదశి పరిహారాలు
కామద ఏకాదశి పరిహారాలు

Kamada ekadashi: నెలకు రెండుసార్లు ఏకాదశి తిథులు వస్తాయి. అలా చైత్ర మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. కొన్నిసార్లు దీన్ని చైత్ర శుక్ల ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేసే రోజు. అందుకే ఈ ప్రత్యేకత ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వాసం. కామద ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్ళు పుణ్యాన్ని పొందుతారు. శాపాలు, పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉంటే బ్రాహ్మణ హత్య వంటి మహా పాతకాల నుంచి క్షమాపణ లభిస్తుంది. అలాగే కామద ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వాసం. ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల మోక్షం లభించి వైకుంఠానికి చేరుకుంటారని నమ్ముతారు.

కామద ఏకాదశి శుభ ముహూర్తం

ఈ ఏడాది కామద ఏకాదశి ఏప్రిల్ 19 న జరుపుకుంటున్నారు. ఈ ఏకాదశి శుభ ముహూర్తం

ఏకాదశి తిథి ప్రారంభం ఏప్రిల్ 18వ తేదీ సాయంత్రం 5:31 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. తిథి ముగింపు ఏప్రిల్ 19 రాత్రి 8.04 గంటల వరకు. ఉదయ తిథి ప్రకారం 19వ తేదీ కామద ఏకాదశి వ్రతం ఆచరించాలి.

కామద ఏకాదశి పరిహారాలు

కామద ఏకాదశి రోజు కొన్ని చర్యలు ఆచరించడం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు. సమస్యలన్నీ తొలగిపోతాయి. కామద ఏకాదశి రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. అలాగే శమీ మొక్కని పూజించాలి. పిండి దీపం వెలిగించి అందులో కర్పూరం, పసుపు వేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో కాలంగా నిలిచిపోయిన ధనం తిరిగి మీ చేతికి అందుతుంది. గ్రహాల శుభ ప్రభావం మీ మీద ఉంటుంది.

పితృ దేవతలకు నైవేద్యం

ఏకాదశి రోజు పవిత్ర నది స్నానం ఆచరించడం ఎంతో ముఖ్యం. లేదంటే గంగాజలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయాలి. పితృ దేవతలను స్మరించుకుంటూ వారికి తర్పణాలు, నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పూర్వికుల దోషాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి.

కోరికలు నెరవేరెందుకు

మీ మనసులోని కోరికలు నెరవేరాలని అనుకున్నట్లయితే కామద ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించాలి. తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించాలి. సాత్విక వస్తువులను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి.

ఆర్థిక లాభం కోసం

ఏడు పసుపు కొమ్ములు తీసుకొని ఒక వస్త్రంలో చుట్టి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి. తర్వాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో భద్రంగా ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది.

ఏకాదశి రోజు లక్ష్మీదేవి సమేత విష్ణుమూర్తిని పూజించాలి. కనకధారా స్తోత్రం, విష్ణు సహస్ర నామాన్ని పఠించడం వల్ల ధనధాన్యాలకు కొదువ ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.

 

Whats_app_banner