హిందూ ధర్మం ప్రకారం, జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి, చంద్ర దేవుడిని పూజిస్తారు. ఈ రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు. కాబట్టి జ్యేష్ఠ పూర్ణిమ నాడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఈ పరిహారాలు పాటించండి.
జ్యేష్ఠ పూర్ణిమ: జూన్ 11, బుధవారం
పూర్ణిమ తిథి మొదలు: జూన్ 10 ఉదయం 8:05
పూర్ణిమ తిథి ముగింపు: జూన్ 11 ఉదయం 9:43
పూర్ణిమ నాడు చంద్రోదయం: జూన్ 11 రాత్రి 10:50
జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ పరిహారాలను పాటించడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండచ్చు. ఇక మరి ఎలాంటి పరిహారాలను పాటించాలో తెలుసుకుందాం.
జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా పెట్టండి. ఈ రోజు పూర్ణిమ చంద్రుని వెలుగులో కొంతసేపు పాయసం ఉంచడం శుభప్రదమని నమ్ముతారు. తరువాత దానిని సేవించాలి. ఇలా చేయడం వల్ల పూర్ణిమ చంద్రుడి ద్వారా సానుకూల శక్తి మీకు లభిస్తుంది.
మత విశ్వాసాల ప్రకారం, మోదుగ పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. జ్యేష్ఠ పూర్ణిమ రోజున పూజలు చేసే సమయంలో లక్ష్మీదేవికి మోదుగ పువ్వును సమర్పించండి. అలాగే, ఇంట్లో మోదుగ పువ్వు మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. దరిద్రం తొలగిపోతుంది.
మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటే, జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి ఏకాక్షి కొబ్బరికాయను సమర్పించండి. జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి ఏకాక్షి కొబ్బరికాయను సమర్పించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్ముతారు. జ్యేష్ఠ పూర్ణిమ పూజ సమయంలో ఏకాక్షి కొబ్బరికాయను అమ్మవారికి సమర్పించి, ఆ తర్వాత రోజు ఈ కొబ్బరికాయను మీ బీరువాలో లేదా డబ్బులు దాచే ప్రదేశంలో ఉంచండి. దీని వల్ల ఇంట్లో శుభం జరుగుతుంది.
జ్యేష్ఠ మాసంలోని పూర్ణిమ రోజున బంగారం, వెండి కొనడం శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం పొందడానికి, సుఖ సంతోషాలను పెంచడానికి ఈరోజు బంగారం లేదా వెండిని కొనడం మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.