జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు? తేదీ, శుభ ముహుర్తం, విశిష్టతతో పాటు ఎలాంటి పరిహారాలను పాటించాలో తెలుసుకోండి!-jyeshta pournami date time significance and also check remedies to be followed on this auspicious day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు? తేదీ, శుభ ముహుర్తం, విశిష్టతతో పాటు ఎలాంటి పరిహారాలను పాటించాలో తెలుసుకోండి!

జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు? తేదీ, శుభ ముహుర్తం, విశిష్టతతో పాటు ఎలాంటి పరిహారాలను పాటించాలో తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఈరోజు శుభకార్యాలని ప్రారంభించడానికి మంచి సమయమని భావిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు నదిలో స్నానం చేయడం వలన ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు. జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు? తేదీ, శుభ ముహుర్తం, విశిష్టతతో పాటు ఎలాంటి పరిహారాలను పాటించాలో తెలుసుకోండి.

జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు? తేదీ, శుభ ముహుర్తం, విశిష్టత (pixabay)

సంవత్సరానికి 12 పౌర్ణమి తిధులు వస్తాయి. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఈరోజు శుభకార్యాలని ప్రారంభించడానికి మంచి సమయమని భావిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు నదిలో స్నానం చేయడం వలన ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు. అదే విధంగా ఈరోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధిస్తే కూడా విశేష ఫలితాలని పొందవచ్చు. ఈరోజు ఉపవాస దీక్షను ఆచరిస్తే కూడా మంచిది.

జ్యేష్ఠ పౌర్ణమి విశిష్టత

  1. పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉతికిన దుస్తులని ధరించాలి. ఆ తర్వాత పూజను ప్రారంభించాలి.
  2. ఈరోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ప్రత్యేకించి పూజిస్తే ఫలితం పొందవచ్చు. ఈరోజు సత్యనారాయణ స్వామిని పూజిస్తే కూడా మంచి జరుగుతుంది.
  3. ప్రవహించే నదిలో స్నానం చేయడం వలన పాపాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.
  4. ఈరోజు రావి చెట్టుని పూజిస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఈ విధంగా ఆచరిస్తే ఆనందం, శ్రేయస్సు కూడా కలుగుతాయి. కష్టాలు తొలగిపోతాయి.

పౌర్ణమి ఎప్పుడు వచ్చింది?

పంచాంగం ప్రకారం చూసినట్లయితే పౌర్ణమి ఉదయం 11:35 గంటలకు మొదలై, జూన్ 11 మధ్యాహ్నం 1:13 నిమిషాలకు ముగుస్తుంది. కనుక ఈ లెక్కన జూన్ 11న జరుపుకోవాలి.

జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏం చేయాలి?

  • జ్యేష్ఠ పౌర్ణమి నాడు దానాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • ఆహారం, బట్టలు వంటి వాటిని దానం చేయవచ్చు. అవసరమైన వాళ్లకి సహాయం చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయి.
  • పౌర్ణమి నాడు దేవాలయాలకు విరాళం ఇస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
  • ఈరోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే దుఃఖం, బాధలు తొలగిపోతాయి. జీవితంలో శాశ్వత ఆనందం ఉంటుంది.
  • జ్యేష్ఠ పౌర్ణమి నాడు తులసి మొక్కని ఆరాదిస్తే కూడా మంచిది. ఈరోజు తులసి మొక్కను పూజిస్తే, జాతకంలో ఏమైనా లోపాలు ఉంటే తొలగించుకోవచ్చు. దానితో పాటు అదృష్టం, శాంతి కూడా కలుగుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.