2025లోనే శక్తివంతమైన అమావాస్య.. బుధవారం+చంద్ర గురువుల సంయోగం+మృగశిర నక్షత్రం.. ఇలా చేస్తే సమస్యే ఉండదు!-jyeshta amavasya is very powerful wednesday moon jupiter combination mrugasira star this is auspicious ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  2025లోనే శక్తివంతమైన అమావాస్య.. బుధవారం+చంద్ర గురువుల సంయోగం+మృగశిర నక్షత్రం.. ఇలా చేస్తే సమస్యే ఉండదు!

2025లోనే శక్తివంతమైన అమావాస్య.. బుధవారం+చంద్ర గురువుల సంయోగం+మృగశిర నక్షత్రం.. ఇలా చేస్తే సమస్యే ఉండదు!

Peddinti Sravya HT Telugu

2025లో వచ్చే అమావాస్యలలో ఈ అమావాస్య చాలా స్పెషల్‌. ఎందుకంటే జూన్ 26 నుంచి వెంటనే గుప్త నవరాత్రులు మొదలవుతాయి. పైగా అమావాస్య నాడు చంద్రుడు, గురువు సంయోగం చెంది మిధున రాశిలో సంచరిస్తారు. పైగా మృగశిర నక్షత్రం చాలా ప్రత్యేకమైనది. ఈ విశేషమైన అమావాస్య నాడు ఏం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది?

2025లోనే శక్తివంతమైన అమావాస్య.. బుధవారం+చంద్ర గురువుల సంయోగం+మృగశిర నక్షత్రం (pinterest)

అమావాస్య గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హిందూ ధర్మంలో అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. 2025లో వచ్చే అమావాస్యలలో ఈ అమావాస్య చాలా స్పెషల్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే జూన్ 26 నుంచి వెంటనే గుప్త నవరాత్రులు మొదలవుతాయి. పైగా అమావాస్యనాడు చంద్రుడు, గురువు సంయోగం చెంది మిధున రాశిలో సంచరిస్తారు. పైగా మృగశిర నక్షత్రం చాలా ప్రత్యేకమైనది.

మృగశిర నక్షత్రం నాడు ఏదైనా మొదలు పెడితే ఖచ్చితంగా అది పూర్తవుతుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి మృగశిర నక్షత్రం చాలా మంచిది. అంతేకాకుండా వెంటనే ఆరుద్ర నక్షత్రం కూడా వస్తుంది. ఇది రాహువు నక్షత్రం. ఏదైనా అనుకున్న వాటిని పూర్తవడానికి ఇది మంచిది. మన కోరికలను త్వరగా నెరవేర్చుకోవడానికి ఈ రోజు చాలా ఉత్తమమైనది.

అమావాస్య తేదీ, సమయం:

జ్యేష్ఠ అమావాస్య తిథి – జూన్ 24 సాయంత్రం 7:00 గంటలకు మొదలవుతుంది.

ముగింపు – జూన్ 25 సాయంత్రం 4:02 గంటలకు.

ఉదయ తిథి ప్రకారం అమావాస్యను చూసుకోవాలి కనుక జూన్ 25న అమావాస్యను జరుపుకోవాలి.

అమావాస్య విశిష్టత:

పితృదేవతలను ఈరోజు ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. అమావాస్య నాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, తర్పణాలు వదలడం వలన పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. వారి ఆశీస్సులు పొందవచ్చు. అమావాస్యనాడు చంద్రుని ప్రభావం తక్కువగా ఉంటుంది. కనుక కొందరిలో మానసిక శాంతి లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. వారు ఈరోజున పూజలు చేయడం వలన సమస్యలు తొలగిపోతాయి.

ఈ విశేషమైన అమావాస్యనాడు ఏం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది?

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ శక్తివంతమైన అమావాస్య నాడు ఏం చేయాలో తెలుసుకుందాం:

1.ఆర్థిక ఇబ్బందులు

ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇది శుభ ఫలితాలను పొందవచ్చు. ధనం కలిగి సంతోషంగా ఉండచ్చు.

2.అనారోగ్య సమస్యలు

కోర్టు కేసులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. ఇలా చేస్తే మీ సమస్యలు తగ్గుతాయి.

3.సంతాన సమస్యలు

సంతాన భాగ్యం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. అలా చేస్తే సంతానం కలిగి సంతోషంగా ఉండచ్చు.

4.మానసిక అశాంతి

మానసిక అశాంతి ఉంటే మానసిక శాంతి కోసం శివుడిని ఆరాధించాలి. ఇలా చేస్తే మీ సమస్యలు తగ్గుతాయి. సంతోషంగా ఉండచ్చు.

5.వైవాహిక సమస్యలు

వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోవాలంటే శ్రీకృష్ణుడిని ఆరాధించాలి. ఇలా చేస్తే మీ బంధం మధురంగా మారుతుంది.

6.ఉద్యోగ సమస్యలు

ఉద్యోగ సమస్యలు తీరాలన్న, ప్రమోషన్ రావాలన్నా హనుమంతుడిని ఆరాధించాలి.

అమావాస్యనాడు ఈ పనులు మాత్రం చేయకండి:

  • అమావాస్యనాడు కొన్ని పనులు చేయడం మంచిది కాదు. అమావాస్యనాడు గృహప్రవేశం, శుభకార్యాలు జరపడం వంటివి చేయకూడదు.
  • ఏదైనా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్న ఈ రోజు మంచిది కాదు.
  • ఈరోజు ద్వేషం, ప్రతికూల ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
  • మద్యపానం, మాంసం సేవించడం లాంటివి మానుకోవాలి. అమావాస్యనాడు సాత్విక ఆహారం తింటే మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.