Lucky zodiac signs: 2025 వరకు ఈ రాశుల వారి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కుబేరుడి ఆశీస్సులతో డబ్బే డబ్బు-jupiter transit into taurus these zodiac signs will lot of benefits till 2025 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiac Signs: 2025 వరకు ఈ రాశుల వారి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కుబేరుడి ఆశీస్సులతో డబ్బే డబ్బు

Lucky zodiac signs: 2025 వరకు ఈ రాశుల వారి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కుబేరుడి ఆశీస్సులతో డబ్బే డబ్బు

Gunti Soundarya HT Telugu
May 01, 2024 07:15 PM IST

Lucky zodiac signs: శుభకరమైన గ్రహంగా పరిగణించే బృహస్పతి మే 1వ తేదీ నుంచి వృషభ రాశిలో సంచరిస్తుంది. దీని వల్ల ఏడాది మొత్తం కొన్ని రాశుల వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. కుబేరుడి ఆశీస్సులతో డబ్బు చేతికి వస్తుంది.

2025 వరకు ఈ రాశుల వారి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
2025 వరకు ఈ రాశుల వారి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

Lucky zodiac signs: దేవగురువు గృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిష్య శాస్త్ర పరంగా బృహస్పతి సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఏడాది తర్వాత బృహస్పతి తన రాశిని మార్చుకున్నాడు.

దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత బృహస్పతి వృషభ రాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. బృహస్పతి సంచరించిన వెంటనే కుబేర యోగం ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో బృహస్పతి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి 2025 వరకు అదృష్టం వెన్నంటే ఉండబోతుంది. 

బృహస్పతి సంచార ప్రభావం 

బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి సంపద, జ్ఞానాన్ని ఇస్తుంది. నిశ్చయాత్మకమైన, ఆధ్యాత్మిక విధానాన్ని అనుసరించడం ద్వారా విజయం సాధిస్తారు. వాక్చాతుర్యంతో సమాజంలో గౌరవం లభిస్తుంది. బృహస్పతి శుభ స్థానం వల్ల గణనీయమైన ఆర్థిక లాభాలను, అసాధారణమైన నైపుణ్యాలను, సృజనాత్మకతను పొందుతారు. 

వృత్తిపరమైన పురోగతి, ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా ఎదుగుతారు. వృషభ రాశిలో బృహస్పతి స్థానం ఆహారం, ఆర్థిక పరిశ్రమలలో గణనీయమైన అభివృద్ధిని తెస్తుంది.

వృషభ రాశికి శుక్రుడు అధిపతి. అయితే బృహస్పతి శుక్ర గ్రహాలు రెండు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అదృష్ట గ్రహాలుగా పరిగణిస్తారు. శుక్రుడు భౌతిక ఆనందం, సంపద, లగ్జరీ, ప్రేమతో సంబంధం కలిగి ఉంటాడు. అటు బృహస్పతి జ్ఞానం, అదృష్టం, వివాహం, పిల్లలు వంటి వాటితో సంబంధం కలిగి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెండు గ్రహాల కలయిక ప్రజలకు వారి జీవితంలో ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి బలమైన స్థానంలో ఉంటే ఆ రాశి జాతకులు దురదృష్టానికి దూరంగా ఉంటారు. అదే బృహస్పతి స్థానం శుభంగా ఉంటే జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరి జాతకంలో అయితే బృహస్పతి బలహీనంగా ఉంటుందో వాళ్లు గురువారం ఉపవాసం ఉండాలి. అలాగే పసుపు నీలమణి రత్నాన్ని ధరించడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది.  అయితే ఏదైనా రత్నాలను ధరించే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యులతో మాట్లాడిన తర్వాత ధరించడం ఉత్తమం. శుభ్రమైన బృహస్థతి సంచారం వల్ల ఏడాది పాటు అదృష్టాన్ని పొందగలిగే రాశులు ఇవే.

సింహ రాశి

బృహస్పతి సంచారంతో ఏర్పడిన కుబేర యోగం సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు క్రమంగా సమసిపోతాయి. బృహస్పతి శుభ ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. 

కన్యా రాశి

బృహస్పతి ప్రవేశం ద్వారా వచ్చే కుబేర యోగం కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. ఆగిపోయిన మీ పని తిరిగి ప్రారంభమవుతుంది. కెరీర్ లో ప్రమోషన్ పొందేందుకు అనేక ముఖ్యమైన పనులు చేపట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సౌభాగ్యంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. 

వృషభ రాశి 

వృషభ రాశిలోనే వైభవానికి కారకుడైన బృహస్పతి ప్రవేశం జరుగుతుంది. ఫలితంగా కుబేర యోగం రావడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అందుకే మీ బడ్జెట్ ని  దృష్టిలో ఉంచుకొని ఖర్చులు నియంత్రించుకోవాలి. కొత్త పనులు ప్రారంభించేందుకు శుభ ప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. 

 

WhatsApp channel