Jupiter transit: గురు గ్రహ సంచారం.. ఈ రాశుల జాతకులకు వృత్తిపరమైన పురోగతి,కొత్త వ్యాపారం చేపడతారు-jupiter transit into taurus these zodiac signs get career growth and starts new business ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Transit: గురు గ్రహ సంచారం.. ఈ రాశుల జాతకులకు వృత్తిపరమైన పురోగతి,కొత్త వ్యాపారం చేపడతారు

Jupiter transit: గురు గ్రహ సంచారం.. ఈ రాశుల జాతకులకు వృత్తిపరమైన పురోగతి,కొత్త వ్యాపారం చేపడతారు

Gunti Soundarya HT Telugu

Jupiter transit: దేవగురువు బృహస్పతి త్వరలో మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి కెరీర్ లో విజయాలు లభిస్తాయి. ఉన్నత స్థానాలు అధిరోహిస్తారు.

గురు గ్రహ సంచారం

Jupiter transit: బృహస్పతి 12 నెలలకు ఒక సారి తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. వచ్చేనెల దేవ గురువు బృహస్పతి శుక్రుడు పరిపాలించే వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

శుక్రుడు, బృహస్పతి మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. గురు గ్రహం కెరీర్, ఆధ్యాత్మికత రెండింటిని ప్రభావితం చేస్తుంది. బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారిని ప్రగతి పథంలో నడిపిస్తుంది. మే 1న బృహస్పతి మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి.

మేష రాశి

దేవ గురువు బృహస్పతి మేష రాశిని విడిచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు. ఫలితంగా ఈ రాశి వారికి వృత్తిపరమైన పురోగతి ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వృత్తిపరమైన పురోగతికి అనేక మార్గాలు, విజయాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో డబ్బును తెలివిగా ఆలోచనాత్మకంగా ఖర్చు పెడతారు. ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు మీకు అవకాశాలు లభిస్తాయి. అనుభవజ్ఞులైన వ్యక్తులతో సంప్రదించిన తర్వాత మాత్రమే ఏవైనా ఆర్థికంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఈ సమయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ వాటిని అధిగమించేందుకు సహనంతో ఉండాలి.

వృషభ రాశి

గురు గ్రహం వృషభ రాశిలోనే సంచరిస్తాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి వృత్తిలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి జీవితంలో విజయాలు సాధించే అవకాశం ఉంది. కెరీర్ లో ఏవైనా అడ్డంకులు, సవాళ్లు ఎదురైతే అవి త్వరగా తొలగిపోతాయి. సంతృప్తిగా ఉంటారు. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన ఇబ్బందులను సమర్ధవంతంగా అధిగమిస్తారు. మంచి ఉద్యోగ ఆఫర్ లభిస్తుంది. కెరీర్ మెరుగుపరుచుకునేందుకు సదావకాశాలు లభిస్తాయి.

మీన రాశి

బృహస్పతి సంచారంతో మీన రాశి జాతకులు ధైర్యంగా, దృఢ సంకల్పంతో ఉంటారు. కెరీర్ పురోగతికి మంచి సమయం. ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. ఇతరులతో సానుకూల సంబంధాలు కొనసాగిస్తారు. మీకు కేటాయించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగల సామర్థ్యాలు పొందుతారు. వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. ప్రభావంతమైన వ్యక్తుల నుండి మద్దతు లభిస్తుంది. సోమరితనానికి దూరంగా ఉంటే మంచిది. లేదంటే అది మీ కెరీర్ ని ప్రమాదంలో పడేస్తుంది.

మకర రాశి

బృహస్పతి సంచారం సమయంలో మకర రాశి వారు ఆందోళన చెందాల్సిన విషయం లేదు. మీ తెలివితేటలతో మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకుంటారు. అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు, జీతం పెరుగుదలకు ఉంటాయి. ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వ్యక్తులు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు వ్యాపారవేత్తలకు ప్రయోజనాలు అందుతాయి. వ్యాపార వెంచర్లలో లాభదాయకమైన అవకాశాలు ఉంటాయి. భాగస్వామి వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్లయితే అవి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. సీనియర్ అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపార పురోగతికి అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం మీకు లభిస్తుంది.