Guru nakshtra transit: గురు నక్షత్ర సంచారం, రానున్న మూడు నెలలు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి
Guru nakshtra transit: బృహస్పతి ఆగస్ట్ 28 నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. మూడు నెలల పాటు ఇదే నక్షత్రంలో ఉంటాడు. దీని వల్ల మూడు రాశుల వారికి రానున్న మూడు నెలల పాటు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.
Guru Nakshatra Transit: దేవగురువు బృహస్పతి మరికొద్ది రోజుల్లో నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో ఉన్న బృహస్పతి ఆగస్ట్ 28 మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. మేషం నుంచి మీన రాశి వారకు దీని ప్రభావం కనిపిస్తుంది.
గురు నక్షత్ర సంచారం వల్ల కొన్ని రాశుల వాళ్ళు పుష్కలమైన ప్రయోజనాలు పొందుతారు. మూడు నెలల పాటు బృహస్పతి ఇదే నక్షత్రంలో ఉంటాడు. దీంతో రానున్న మూడు నెలలు మూడు రాశుల వాళ్ళు సకల సుఖాలు అనుభవిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు.
మృగశిర నక్షత్ర ప్రాముఖ్యత
జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలలో మృగశిర నక్షత్రం ఐదవది. ఈ నక్షత్రం సగ భాగం వృషభ రాశిలో, మిగిలిన సగ భాగం మిథున రాశిలో ఉంటుంది. మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రేమ, ఆప్యాయతలు కలిగి ఉంటారు. చాలా నిజాయితీగా, తెలివిగా ఉంటారు.
ఈ నక్షత్రంలో పుట్టిన వారి ప్రవర్తన మర్యాద పూర్వకంగా, స్నేహపూర్వకంగా ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. మృగశిర నక్షత్రంలో జన్మించిన స్థానికులు పరిశోధనాత్మక స్వభావం, అధిక ఉత్సుకత కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు సరళమైన, సూత్రప్రాయమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మృగశిర నక్షత్రంలో గురు సంచారం వల్ల ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయో చూద్దాం.
వృషభ రాశి
మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారం వృషభ రాశికి చాలా అదృష్టాన్ని ఇస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో ఏర్పడిన అభిప్రాయభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, ఆప్యాయత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు వృత్తిలో పురోగతికి గొప్ప అవకాశాలు వస్తాయి. ప్రమోషన్ తో పాటు జీతాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సమాజంలో వారి ప్రతిష్ట, గౌరవం పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది.
సింహ రాశి
బృహస్పతి సంచారం సింహ రాశి వారి జీవితాల నుండి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు తమ వృత్తిలో పురోగతిని సాధిస్తారు మరియు వారి కార్యాలయంలో వారి సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు. దీంతో పాటు పనిలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కెరీర్‌లో అడ్డంకులు లేదా ఇబ్బందులు ఉంటేఅవి తొలగిపోతాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వివాహం కుదిరే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారం ధనుస్సు రాశికి చాలా శుభప్రదమైనది. ఈ కాలంలో జీవితంలోని ప్రతి రంగంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వారి సంపద పెరుగుతుంది. దీని కారణంగా వారి జీవితంలో మూడు నెలల పాటు ఆనందం ఉంటుంది. వారు ఆకస్మిక ఆర్థిక లాభాలను, పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు గణనీయంగా పెరుగుతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.