కర్కాటక రాశిలోకి గురువు, ఈ 3 రాశుల వారికి సువర్ణావకాశం.. ప్రమోషన్లు, శుభవార్తలు, సంతోషాలు!-jupiter transit in karkataka rasi and it gives many benefits to libra scorpio and pisces ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కర్కాటక రాశిలోకి గురువు, ఈ 3 రాశుల వారికి సువర్ణావకాశం.. ప్రమోషన్లు, శుభవార్తలు, సంతోషాలు!

కర్కాటక రాశిలోకి గురువు, ఈ 3 రాశుల వారికి సువర్ణావకాశం.. ప్రమోషన్లు, శుభవార్తలు, సంతోషాలు!

Peddinti Sravya HT Telugu

గురువు సంచారం కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. అక్టోబర్ నెలలో గురువు మిథున రాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఇది 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి వస్తుంది.

కర్కాటక రాశిలోకి గురువు (pinterest)

గురువు ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 12 ఏళ్ల తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు సంచారం కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. గురువు అతిచార 2032 వరకు ఉంటుంది, అంటే ఎప్పుడూ కదిలే వేగం కంటే మరింత వేగంగా సంచరిస్తాడు.

అక్టోబర్ నెలలో గురువు మిథున రాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఇది 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి వస్తుంది. ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది? గురువు కర్కాటక రాశి ప్రవేశంతో ఎవరు ఎలాంటి లాభాలను పొందవచ్చు? వారిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించడంతో మూడు రాశుల వారికి బోలెడు లాభాలు

1.తులా రాశి:

గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో తులా రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం అరుస్తుంది. కొత్త ఉద్యోగాలను పొందుతారు, ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. భారీగా లాభాలను పొందుతారు. పేరు, ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు.

2.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి గురువు కర్కాటక రాశి సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో సక్సెస్‌ను పొందుతారు. రాశి విద్యార్థులు కూడా సక్సెస్‌ను పొందుతారు.

3.మీన రాశి:

మీన రాశి వారికి గురువు కర్కాటక రాశి సంచారంతో అనేక లాభాలను పొందవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. పిల్లలకు సంబంధించిన మంచి వార్తలు అందుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త సమాచారాన్ని కూడా పొందుతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.